Gold Price Today July 16th 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ బంగారం ధర భారీగా దిగొచ్చింది. కొద్దిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న ధర ఇవాళ ఒక్కసారిగా భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 మేర, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 మేర తగ్గింది. తగ్గిన ధరలతో ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730గా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు : 


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం (జూలై 13) రూ.46,900 ఉండగా.. ఇవాళ అది రూ.46,500కి తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న  రూ.51,160 ఉండగా.. ఇవాళ అది రూ.50,730కి చేరింది.


ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:


దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా నగరాల్లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉంది. 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,580గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,820గా ఉంది.


పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,530 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,760గా ఉంది. 


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730గా ఉంది. 


ప్రస్తుత జూలై నెలలో 7వ తేదీన అత్యధికంగా రూ.820 మేర బంగారం ధర తగ్గింది. అంతకుముందు రోజు జూలై 6న రూ.540 మేర ధర తగ్గింది. ఆ తర్వాత కొద్ది వారాల పాటు స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతూ వచ్చింది. దాదాపు 10 రోజుల తర్వాత బంగారం ధర ఇవాళ మళ్లీ భారీగా దిగొచ్చింది. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు తదితర అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.


(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ధరలు వివిధ మూలాల నుంచి సేకరించబడినవి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా జ్యువెలరీ వ్యాపారితో సంప్రదించి ధరలను నిర్ధారించుకోండి.)


Also Read: Godavari Floods LIVE: భద్రాచలం సేఫేనా? మరో నాలుగు గంటలు గడిస్తేనే.. పోలవరంలోనూ హై టెన్షన్


Also Read: Horoscope Today July 16th: నేటి రాశి ఫలాలు.. అవివాహితులైన ఈ రాశి వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే ఛాన్స్..  



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.