Gold Price Today June 4th 2022 : పసిడి ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.500, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.540 మేర ధర పెరిగింది. శుక్రవారం (జూన్ 03) నాడు పెరిగిన ధరలే మళ్లీ రిపీట్ అయ్యాయి. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 


హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న (జూన్ 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా... ఇవాళ రూ.48,100కి  పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.51,930 ఉండగా... ఇవాళ రూ.52,470కి చేరింది.


ఏపీలోని విజయవాడలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.52,470గా ఉంది.


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580గా ఉంది. 


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470గా ఉంది.


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..48,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470గా ఉంది.


పుణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,180 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550గా ఉంది. 


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..48,100  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470గా ఉంది. మిగతా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


Also Read: Gangrape: బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్.. నిందితుల్లో హోంమంత్రి మనవడు? క్లారిటీ ఇచ్చిన డీసీపీ...  


Also Read: Horoscope Today June 4th : నేటి రాశి ఫలాలు... ఆ రాశి వారికి జీవిత భాగస్వామి నుంచి అనుకోని సర్‌ప్రైజ్...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook