Gangrape: బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్.. నిందితుల్లో హోంమంత్రి మనవడు? క్లారిటీ ఇచ్చిన డీసీపీ...

Gangrape: తెలంగాణలో సంచలనంగా మారిన, రాజకీయ రచ్చగా మారిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.  ఇప్పటికే ఈ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న

Written by - Srisailam | Last Updated : Jun 4, 2022, 07:06 AM IST
  • గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్
  • హోంమంత్రి మనవడిపై ఆరోపణలు
  • హోంమంత్రి మనవడికి పోలీసుల క్లీన్ చిట్
Gangrape: బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్.. నిందితుల్లో హోంమంత్రి మనవడు? క్లారిటీ ఇచ్చిన డీసీపీ...

Gangrape: తెలంగాణలో సంచలనంగా మారిన, రాజకీయ రచ్చగా మారిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.  ఇప్పటికే ఈ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కొడుకు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. నిందితుల్లో తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హోంమంత్రి మనవడిని పోలీసులు కాపాడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఘటన జరిగిన అమ్నేషియా పబ్ లో సీపీ టీవీ దృశ్యాల్లో హోంమంత్రి మనవడు కనిపిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

గ్యాంగ్ రేప్ కేసులో హోంమంత్రి మనవడు ఉన్నారనే ఆరోపణలపై వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ స్పందించారు. కేసు వివరాలను మీడియాకు తెలిపిన డీసీపీ.. విపక్షాల ఆరోపణలపైనా క్లారిటీ ఇచ్చారు.ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని.. మిగిలిన నిందితులను 48 గంటల్లోగా పట్టుకుంటామని చెప్పారు. తాము అరెస్ట్ చేసిన వారిలో వ క్ఫ్‌బోర్డు చైర్మన్‌ మసీవుల్లాఖాన్‌ కొడుకు ఖాదర్‌ఖాన్‌, అతని ఫ్రెండ్ హాదీ ఉన్నారని డీసీపీ తెలిపారు. మే28న ఈ ఘటన జరగగా... మే 31న అత్యాచారం జరిగిందని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని వెంటనే దర్యాప్తు చేశామని వెల్లడించారు. ఘటన జరిగి నాలుగు రోజులు కావడంతో బాలిక నిందితులను గుర్తించలేకపోయిందన్నారు. ఒకరి పేరు మాత్రం బాధితులురాలు చెప్పిందని డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. పబ్ తో పాటు పరిసర ప్రాంత సీసీపుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధితురాలు చెప్పిన విషయాలతో టెక్నికల్‌ ఆధారాలను సేకరించామన్నారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను గుర్తించామని డీసీపీ తెలిపారు. ఇందులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు. గ్యాంగ్ రేప్ ఘటనలో హోం శాఖ మంత్రి మనవడు ఉన్నారనే వార్తల్లో నిజం లేదన్నారు డీసీపీ జోయల్ డేవిస్. ఈ కేసుతో అతనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పబ్‌కు మైనర్‌ బాలికను హాది తీసుకొచ్చారని తెలిపారు. సీసీపుటేజీ విశ్లేషణలోనూ ఎక్కడా హోంమంత్రి మనవడు పుర్ఖాన్‌ కనిపించలేదన్నారు.కావాలనే కొందరు అతనిపై ఆరోపణలు చేస్తున్నారని డీసీపీ అన్నారు. బహదూర్ పురా ఎమ్మెల్యే కొడుకుపైనా ఇప్పటి వరకూఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్న డీసీపీ..నిందితులపై 354 ipc 9 అండ్ 10 పోస్కో ఆక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించామని వెల్లడించారు. బాలిక శరీరంపై గాయాలున్నాయన్నారు. ఈ కేసులో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు ఉన్నా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇన్నోవ వాహనంలో 5 ఐదుగురు అబ్బాయిలతో పాటు పాప కూడా అందులోనే ఉందన్నారు. అదే కారులో అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు.బాధితురాలి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వివరాలు సేకరించడం లో కొత్త ఆలస్యం జరిగిందన్నారు జోయల్ డేవిస్. 

READ ALSO: Pawan Kalyan Comments: వైసీపీ గ్రూప్ తగాదాల వల్లే కోనసీమ అల్లర్లు..పవన్‌ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

READ ALSO: Supreme court: ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఇక చెల్లవు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News