Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం ధర భారీగానే తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధరలపై చాలా కారణాలు ప్రభావం చూపిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి వంటివి బంగార ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధర రోజురోజుకూ మారుతుంటుంది. ఇవాళ దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధర ఇలా ఉంది. 


దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Gold Rate) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 650 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 500 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 2 వందలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 45 వేల 5 వందల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వే 640 రూపాయలుంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (Hyderabad Gold Price) 10 గ్రాముల ధర 45 వేల 5 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది. 


Also read: Tata AirIndia: 69 ఏళ్ల తర్వాత సొంత గూటికి ఎయిర్​ ఇండియా- టాటా గ్రూప్ ఆనందం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook