Todays Gold Rate: కొత్త ఏడాదిలో పసిడి ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. వరుసగా మూడవరోజు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పు ఉంటుంది. ఇక కొత్త ఏడాది ప్రారంభమవుతూనే బంగారం ప్రియులకు నిరాశ కల్గింది. వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా వివిద నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర (Gold Rate) ఇలా ఉంది.


దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 610 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 940 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 160 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 160 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 6 వందలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 740 రూపాయలుగా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 160 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 860 రూపాయలుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 460 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 6 వందల రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 460 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 6 వందలుగా ఉంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఒకేలా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 460 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 6 వందలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 460 రూపాయయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 6 వందలుగా ఉంది.


Also read: OnePlus 10 Pro : 12జీబీ ర్యామ్‌, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్‌.. త్వరలో లాంఛ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి