Gold Price Today 11 August 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు పసిడి ధర పెరిగితే, మరో రోజు తగ్గుతుంది.. ఇంకో రోజు మాత్రం స్థిరంగా ఉంటుంది. డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే బంగారం ధరలు ఎంత పెరిగినా, తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. 3-4 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. ఇవాళ ధరల పెరుగుదలకు చెక్ పడింది. గురువారం (ఆగష్టు 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,350లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 600.. 24 క్యారెట్ల ధరపై రూ. 660 తగ్గింది.


# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,870గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,650గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,930గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,380 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400.. 24 క్యారెట్ల ధర రూ. 51,710గా నమోదైంది. 
# కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,650గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,650గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,350.. 24 క్యారెట్ల ధర రూ. 51,650గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,650 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 58,700లగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో రూ. 300 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 58,700లుగా ఉండగా..  చెన్నైలో రూ. 64,200లుగా ఉంది. బెంగళూరులో రూ. 64,200గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 64, 200లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 64,200ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Horoscope Today 11 August 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల ప్రేమికులు విజయం సాధిస్తారు!  


Also Read: Laal Singh Chaddha: నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook