Laal Singh Chaddha: నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?

Laal Singh Chaddha Twitter Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా, నాగచైతన్య ఒక కీలక పాత్రలో గా నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఆ సినిమా ట్విట్టర్ రివ్యూ చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2022, 06:58 AM IST
  • లాల్ సింగ్ చద్దా మూవీతో బాలీవుడ్ కు నాగచైతన్య
  • నేడే ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల
  • నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?
Laal Singh Chaddha: నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?

 Laal Singh Chaddha Twitter Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. అనేక ఆస్కార్ అవార్డులు సంపాదించిన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఆగస్టు 11న రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటించడంతో తెలుగు ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది.

దానికి తగ్గట్టు ఇప్పటివరకు లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాను ప్రెజెంట్ చేస్తూ ఉండడం సినిమా మీద మరింత ఆసక్తి పెంచింది. అద్వైత చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను  వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లపై అమీర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేయడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి, ఇక ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఈ సినిమా గురించి తమ రివ్యూలు బయట పెడుతున్నారు. ఆ వివరాలు ఏమిటో చూసేద్దాం పదండి.

జర్మనీలోని బెర్లిన్‌లో లాల్‌సింగ్ చద్దా చిత్రాన్ని ఇప్పుడే చూశాను. ఎప్పటి లాగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్  అనూహ్యంగా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ మూవీ  అందించింది. మేకింగ్ బాగుంది, దర్శకుడు చాలా ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చేశాడు. వాస్తవిక కథ కోసం ⅘ రేటింగ్ ఇస్తున్నానని ఒక నెటిజన్ రాసుకొచ్చారు.

లాల్‌సింగ్ చద్దా పెయిడ్ ప్రివ్యూని ఇప్పుడే చూశాను, నేను చూసిన అత్యుత్తమ భారతీయ చలన చిత్రాల్లో ఇది కూడా ఒకటి...ప్రతి ఒక్కరు తప్పక మీ కుటుంబం సహా స్నేహితులతో చూసి ఆనందించండి అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక లాల్‌సింగ్ చద్దా ఒక బ్లాక్‌బస్టర్ అని, బలమైన నటన, మంచి కథాంశంతో గుర్తుండిపోయే పాత్రలు ఉన్నాయని మరో నెటిజన్ కూడా కామెంట్ చేశారు.

లాల్‌సింగ్‌ చద్దా ఇప్పుడు అవసరం, అత్యున్నత స్థాయి సంగీతంతో పాటు భావోద్వేగాలు వంటి సంపూర్ణ సమ్మేళనం ఈ సినిమా. అమీర్ ఖాన్ మ్యాజిక్, వంక పెట్టలేని కరీన్ కపూర్ ఖాన్ నటన సహా మిగిలిన నటీనటులు కూడా అద్భుతమైన నటనా కౌశలం చూపారు, తప్పక చూడవలసిన సినిమా ఇది అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

అయితే ఈ సినిమా మీద బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుండడంతో కొందరు సినిమా చూడకుండానే బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సినిమా చూశాక కూడా నచ్చక పోవడంతో తమకు సినిమా నచ్చలేదని కామెంట్ చేస్తున్నారు.

Also Read: Viral Video: RRRలో భీమ్‌ ఎంట్రీకి చాగంటి మాటలు.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!

Also Read: Rana Daggubati: రానా ఇంస్టాగ్రామ్‌లో పోస్టులన్నీ డిలీట్ చేయడానికి కారణాలు ఇవేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Trending News