Gold Price Today 12 August 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఒక రోజు బంగారం ధర పెరిగితే, మరో రోజు తగ్గుతుంది.. ఇంకో రోజు స్థిరంగా ఉంటుంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ విలువ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే బంగారం ధరలు పెరిగినా లేదా తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే సాగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. 4-5 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. అయితే పెరుగుతున్న ధరలకు నిన్న పిలిస్టాప్ పడింది. నేడు అదే ధరలు కొనసాగుతున్నాయి. శుక్రవారం (ఆగష్టు 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,350లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై ఎలాంటి మార్పు లేదు. 


# దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,870గా ఉంది. 
# వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,650గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,290 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400.. 24 క్యారెట్ల ధర రూ. 51,710గా నమోదైంది. 
# కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,650గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,650గా ఉంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 47,350.. 24 క్యారెట్ల ధర రూ. 51,650గా నమోదైంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,650 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 58,900లగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో రూ. 200 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 58,900లుగా ఉండగా.. చెన్నైలో రూ. 64,200లుగా ఉంది. బెంగళూరులో రూ. 64,200గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 64, 200లుగా ఉంది.విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి ధర రూ. 64,200ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Raksha Bandhan Special Horoscope : రక్షా బంధన్ స్పెషల్.. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందంటే..


Also Read: Macherla Niyojakavargam: అమెరికా ప్రీమియర్ షోలన్నీ రద్దు.. అసలు ఏమైందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook