Raksha Bandhan Special Horoscope : రక్షా బంధన్ స్పెషల్.. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందంటే..

Horoscope Today August 12th 2022: ఇవాళ శ్రావణ శుక్రవారం. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని కొలిచే రోజు. ఇవాళే రాఖీ పండగ కూడా కావడం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2022, 06:43 AM IST
  • ఇవాళ శ్రావణ శుక్రవారం.. ఇవాళే రాఖీ పండగ కావడం విశేషం
    మహాలక్ష్మి పూజతో పాటు రాఖీ పండగను ఇవాళ ఘనంగా జరుపుకుంటారు
    ఈ శుక్రవారం ఏ రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Raksha Bandhan Special Horoscope : రక్షా బంధన్ స్పెషల్.. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందంటే..

Horoscope Today August 12th 2022: ఇవాళ శ్రావణ శుక్రవారం. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని కొలిచే రోజు. ఇవాళే రాఖీ పండగ కూడా కావడం విశేషం. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు సంతోషంగా పండగను జరుపుకుంటారు. మరి రక్షా బంధన్ పర్వదినాన ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 

మేష రాశి (Aries)

ఇవాళ కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంట్లో చిన్న పిల్లలు మీ నుంచి బహుమతులు ఆశిస్తారు. పిల్లల కోరికను మీరు నెరవేరుస్తారు. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. రాఖీ వేడుక ఇంటికి సంతోషాలు మోసుకొస్తుంది.

వృషభ రాశి (Taurus)

బిజినెస్‌లో కొన్ని మార్పులు చేర్పులు కలిసొస్తాయి.ఇన్సూరెన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ రంగంలో పనిచేస్తున్నవారికి ఇవాళ అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. భావోద్వేగపూరితమైన నిర్ణయాలు సరికాదు. అవి మీకు హానీ తలపెట్టవచ్చు. మీ బలహీనతలను గుర్తించి అధిగమించే ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడం ద్వారా మీ బలాబలాలపై ఒక అంచనాకు రావొచ్చు.

మిథున రాశి (GEMINI)

వ్యాపార వృద్ధి జరుగుతుంది. చేపట్టిన ప్రతీ పని సకాలంలో పూర్తి చేస్తారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి. మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటిల్లిపాదీ రాఖీని సంబరంగా జరుపకుంటారు.

కర్కాటక రాశి (Cancer) 

విద్యార్థులు, వ్యాపారస్తులకు శుభసమయం. మీ ప్రత్యర్థులు లేదా పోటీదారులు మీతో పోటీపడలేక చేతులెత్తేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రోజంతా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. రాఖీ పండగను ఇంట్లో సంబరంగా జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు రాఖీలు కట్టుకుని సంతోష వాతావరణంలో వేడుక జరుపుకుంటారు.

సింహ రాశి (LEO)

రిలేషన్‌షిప్‌ విషయంలో పెద్ద డైలామా వెంటాడుతుంది. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతారు. స్నేహితులు, సన్నిహితుల సలహాలు కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. అంతరాత్మ ప్రబోధానుసారం వ్యవహరిస్తారు. రిలేషన్‌షిప్ బ్రేక్ అయ్యే అవకాశం లేకపోలేదు. అవివాహితులైన యువతకు మంచి పెళ్లి సంబంధం రావడమే కాదు, పెళ్లి తేదీ కూడా నిశ్చయమవుతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్థలు, చికాకులు ఉంటాయి. 

కన్య రాశి (Virgo)

గతంలో జరిగిన కొన్ని సంఘటనలు రిలేషన్‌షిప్‌లో ఇప్పటికీ ఇబ్బందులు తీసుకొస్తాయి. సమస్య మరింత జటిలమవుతుంది. మీ రిలేషన్‌షిప్‌లో తిరిగి ప్రేమమయంగా మార్చేందుకు విఫల ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రియురాలు లేదా ప్రియుడిని నేరుగా కలిసి పెళ్లిపై చర్చిస్తారు. భవిష్యత్తులో ఒక కొత్త మార్గానికి ఇక్కడి నుంచే బాటలు పడుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. 

తులా రాశి (Libra)

వ్యాపారపరమైన ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆ వ్యక్తుల అద్భుత విషయ అవగాహన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. వారితో స్నేహం మీ దృక్పథాన్ని మార్చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి శుభసమయం. బిజినెస్‌లో ఉన్నవారు కొత్త ఒప్పందాల కోసం విపరీతంగా ప్రయత్నిస్తారు. ఎట్టకేలకు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది.

వృశ్చిక రాశి (Scorpio)

వృత్తిపరంగా సక్సెస్‌ను చవిచూస్తారు. ప్రేమలో ఉన్నవారు ప్రేయసి లేదా ప్రియుడి మనసెరిగి ప్రవర్తించాలి. వివాహితులు తమ అవసరాలను, మీ ఆలోచనలను జీవిత భాగస్వామితో పంచుకోండి. ఇద్దరికి ఒకరంటే ఒకరికి మరింత నమ్మకం ఏర్పడుతుంది. రాఖీ పండగను బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రత్యేక వంటకాలతో అతిథులకు విందు ఏర్పాటు చేస్తారు.

ధనుస్సు రాశి (Sagittarius)  

రిలేషన్‌షిప్‌కి బ్రేకప్ చెప్పి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారు ఇవాళ ఉపశమనం పొందుతారు. ఇకనుంచి మీ కోసం ఆలోచించడం మొదలుపెడుతారు. నిన్నటిదాకా జరిగిన దాన్ని తలుచుకుని బాధపడితే సమయం వృథా అవుతుందని గ్రహిస్తారు. ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడండి. అనవసర జోక్స్ చేయకండి. వివాహితులు తమ జీవితభాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన చెందుతారు.

మకర రాశి (Capricorn) 

ఫిట్‌నెస్‌పై ఇవాళ్టి నుంచి ఎక్కువగా ఫోకస్ చేస్తారు.ఆరోగ్యం ఇదివరకటి కన్నా బాగుంటుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎప్పుడూ తగినంత నీళ్లు తాగుతూ హైడ్రేట్‌గా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండగ జరుపుకోవడం అందరిలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతుంది.

కుంభ రాశి (Aquarius)

రాజకీయాల్లో ఉన్నవారి గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఉంటాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. మీ రిలేషన్‌షిప్‌ను పెళ్లి వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు. ప్రేమ బంధం మరింత మధురంగా మారుతుంది. గత చేదు జ్ఞాపకాలు పూర్తిగా మీ మది నుంచి తొలగిపోతాయి. వివాహితులు తమ జీవితభాగస్వామితో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది.

మీన రాశి (Pisces) 

కుటుంబంతో కలిసి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. కొన్ని విషయాల్లో గుడ్ న్యూస్ అందవచ్చు. కోర్టు వ్యవహారాల్లో విజయం మీ వైపే ఉంటుంది. పిల్లలను ఒంటరిగా బయటకు పంపించవద్దు. స్నేహితులతో స్నేహ బంధం మరింత వికసిస్తుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. చేపట్టిన పనులను నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఇంటిల్లిపాదీ సంతోషంగా రాఖీ పండగ జరుపుకుంటారు. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు

Also Read: Aadhaar Centre: ఇక నుంచి రైల్వే స్టేషన్లలో సైతం ఆధార్ కేంద్రాలు, ఏ సేవలు ఉచితమంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News