Gold and Silver Price Today 3 December 2022: ఈ వారంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు పెరిగాయి. బుధవారం మొదలైన పసిడి ధర పెరుగుదల.. శనివారం వరకు కొనసాగింది. శనివారం (డిసెంబర్ 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,250లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,730లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 500.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 550 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లిళ్ల సీజన్ ఆరంభం అవడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. నవంబర్ ఆరంభంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800లుగా ఉండగా.. ఇప్పుడు రూ. 49,250లుగా ఉంది. అంటే దాదాపుగా రూ. 2,500 పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం 10 క్యారెట్ల 24 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 53,900 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల్‌ గోల్డ్‌రూ. 49,400గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,900గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,730గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,760 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,300గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,780గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,730గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,730గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250.. 24 క్యారెట్ల ధర రూ. 53,730గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,730 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. శనివారం (డిసెంబర్ 3) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 64,300లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏకంగా రూ.700 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 64,300లుగా ఉండగా.. చెన్నైలో రూ. 72,000లుగా ఉంది. బెంగళూరులో రూ. 71,000గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 71,000ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Telangana Weather: తెలంగాణ‌లో పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. రాబోయే ఐదురోజుల పాటు..!


Also Read: Horoscope Today 3 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు వారికి ధన వ్యయం తప్పదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook