Telangana Weather: తెలంగాణ‌లో పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. రాబోయే ఐదురోజుల పాటు..!

Telangana cold temperatures will Increase for the next five days. రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొగమంచు సంభవించే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 3, 2022, 05:54 AM IST
  • తెలంగాణ‌లో పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌
  • రాబోయే ఐదురోజుల పాటు
  • పొగమంచు సంభవించే అవకాశం
Telangana Weather: తెలంగాణ‌లో పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. రాబోయే ఐదురోజుల పాటు..!

Telangana cold temperatures will Increase for the next five days: బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఆదివారం (డిసెంబర్‌ 4) తుఫాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దాంతో సోమవారం (డిసెంబర్‌ 5) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడనుందట. ఇక డిసెంబర్‌ 7 ఉదయం నాటికి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో చ‌లి తీవ్ర‌త‌ పెరిగే అవకాశం ఉందట. 

తెలంగాణ రాష్ట్ర ప్రజలు చ‌లితో ఇప్పటికే వణుకుతున్నారు. హైదరాబాద్‌, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, జనగాం, వరంగల్, కరీంనగర్,  ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఉదయం దట్టమైన పొగమంచు కప్పేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక తుఫాను ఆవర్తనం కారణంగా చలి మరింత పెరగనుందట. 

రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, పొగమంచు సంభవించే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణం నుంచి తూర్పు దిశగా వేగంగా గాలులు వీయనున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలుగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే ఉదయం పూట బయటికి రావాలని పేర్కొంది. 

Also Read: Samantha:మా సినిమాలో విలన్ గా నటించమన్న అడివిశేష్.. సమంత మైండ్ బ్లాకింగ్ రిప్లై!!

Also Read: Students attacked: కీచకుడిగా మారిన టీచర్.. చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పిన బాలికలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News