Gold Price Today 6 December 2022: పెళ్లిళ్ల సీజన్ ఆరంభం అవడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం (డిసెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,600లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,110లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 160 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,260గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,040 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,650గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,110గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. సోమవారం (డిసెంబర్ 6) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 66,500లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏకంగా రూ. 1300 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 66,500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 72,500లుగా ఉంది. బెంగళూరులో రూ. 72,500గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 72,500ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Hyderabad Cold Updates: ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. హైద‌రాబాద్‌ను వణికిస్తున్న చలి!  


Also Read: Horoscope Today 6 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలను వింటారు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.