Horoscope Today 6 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలను వింటారు!

Today Astrological prediction for 6 December 2022. కర్కాటకం, కన్య రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారు నేడు శుభవార్తలను వింటారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 6, 2022, 06:05 AM IST
  • 6 November 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఆ రాశుల వారు శుభవార్తలను వింటారు
Horoscope Today 6 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలను వింటారు!

Horoscope Today 6 December 2022: మేషం (Aries): శుభకాలం నడుస్తోంది. తోటివారి సహకారంతో ముందుకు సాగండి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన మంచిది.

వృషభం (Taurus): మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో  ఓర్పు, సహనం అవసరం. ఆర్ధికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అనాలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini): చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మూతనంగా ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రయాణంలో జాగ్రత్త. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

కర్కాటకం (Cancer): శుభకాలం. సంతోషకరమైన వార్తలను వింటారు. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

సింహం (Leo): అన్ని పనుల్లో అవరోధాలు ఉన్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. మొహమాటంతో లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. శ్రీసుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదవండి.

కన్య (Virgo): మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గాదేవి ఆరాధన శక్తిని ఇస్తుంది.

తుల (Libra): అన్ని రంగాల వారికీ అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో పూర్తి స్పష్టత ఉంటుంది. కీలక విషయాల్లో కుటుంబసభ్యుల సలహాలు మేలు చేస్తాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (Scorpio): మీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం నడుస్తోంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.

ధనస్సు (Sagittarius): ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఉన్నా అధిగమించే ప్రయత్నం చేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శివుడిని ఆరాధిస్తే మంచిది.

మకరం (Capricorn): చిత్తశుద్ధితో పనులు చేయాల్సి ఉంటుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయొద్దు. కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నవగ్రహ ధ్యానం శుభప్రదం. 

కుంభం (Aquarius): శుభకాలం నడుస్తోంది. ఉత్సాహవంతమైన సమయాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైవ నామాన్ని జపించండి.

మీనం (Pisces): కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణ సూచన ఉంది. శ్రీలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.

Also Read: UV creations: అటు మైత్రీ, ఇటు దిల్ రాజు.. సంక్రాంతికి చిన్న సినిమాతో షాకిచ్చిన యూవీ

Also Read: నన్ను మెడపట్టి గెంటేశారని రాశారు.. అప్పటి విషయం బయటపెట్టిన తెలుగు లిరిసిస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News