Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది...
Gold Price Today August 20th 2022 : ఇవాళ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4780గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5215గా ఉంది.
Gold Price Today August 20th 2022 : గత రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ స్వల్ప మేర దిగొచ్చాయి. రెండు రోజుల క్రితం తగ్గిన ధరలే మరోసారి రిపీట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 మేర ధర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్, విజయవాడల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ సహా ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఒకే ధరలు కొనసాగుతున్నాయి. ఈ మూడు నగరాల్లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52.150గా ఉంది. రెండు రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే రూ.100 మేర ధర తగ్గింది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,950గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,310గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200గా ఉంది.
మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,830 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,180గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది.
గడిచిన 10 రోజుల్లో రెండుసార్లు పెరిగిన బంగారం ధర నాలుగుసార్లు దిగొచ్చింది. మొత్తంగా ఈ 10 రోజుల్లో రూ.880 మేర పెరిగిన ధర రూ.1040 మేర దిగొచ్చింది. అంటే, పెరిగిన దాని కన్నా తగ్గిందే ఎక్కువ. బంగారంపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా నగరాన్ని బట్టి ధర మారుతుంది. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ తదితర అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి.
Also Read: CM KCR Convoy: సినిమా స్టైల్లో మునుగోడు సభకు కేసీఆర్.. వేల సంఖ్యలో కార్లతో భారీ కాన్వాయ్ ?
Also Read: Horoscope Today August 20th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశి వారిని నెగటివిటీ వెంటాడుతుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook