CM KCR Convoy: సినిమా స్టైల్లో మునుగోడు సభకు కేసీఆర్.. వేల సంఖ్యలో కార్లతో భారీ కాన్వాయ్‌ ?

CM KCR Convoy in Munugode TRS Meeting: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ప్రజా దీవెన సభ పేరిట భారీ బహిరంగ సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మునుగోడులో జరగనున్న ఈ ప్రజా దీవెన సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Written by - Pavan | Last Updated : Aug 20, 2022, 12:11 AM IST
CM KCR Convoy: సినిమా స్టైల్లో మునుగోడు సభకు కేసీఆర్.. వేల సంఖ్యలో కార్లతో భారీ కాన్వాయ్‌ ?

CM KCR Convoy in Munugode TRS Meeting: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ప్రజా దీవెన సభ పేరిట భారీ బహిరంగ సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మునుగోడులో జరగనున్న ఈ ప్రజా దీవెన సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్ రాక ఈసారి మామూలుగా ఉండటం లేదని తెలుస్తోంది. సినిమా స్టైల్లో భారీ సంఖ్యలో వాహనాలు సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో క్యూ కట్టనున్నాయని సమాచారం. చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ ఎక్కడ సభ జరిగితే అక్కడికి సమీపంలోకే హెలీక్యాప్టర్ ద్వారా చేరుకోవడం చూస్తూ వస్తున్నాం. అయితే ఈసారి మాత్రం మునుగోడుకు భారీ ఎత్తున కాన్వాయ్ రానున్నట్టు తెలుస్తోంది. ఈ సభకు సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం 2000 నుంచి 4500 కార్లు ఉపయోగించనున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా అది సాధ్యపడే అంశం కాదనే వాళ్లు కూడా లేకపోలేదు. 

ఇదిలావుంటే, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు రానున్న నేపథ్యంలో వాహనాల రద్దీ కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. రేపు హైవే మార్గంలో వెళ్లేవారు ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 1.00 గంట నుండి 4.00 గంటల వరకు హైవేకి దారితీసే మార్గాలను వదిలేసి మరో దారిలో వెళ్ళాల్సిందిగా మనవి చేశారు. ఇదిలావుంటే, ఈ సభా వేదికపైనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేయబోయే టీఆర్ఎస్ అభ్యర్థి ( Munugode Bypolls TRS candidate name)పేరును కూడా ఖరారు చేస్తారని వార్తలొస్తున్నాయి.  

Also Read : Power Crisis: తెలంగాణకు కరెంట్ గండం.. రైతులు సహకరించాలన్న ప్రభుత్వం

Also Read : Munugode Bypoll: కాళ్లు మొక్కి ఓట్లు అడగనున్న రేవంత్ రెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం

Also Read : Munugode Bypoll: మునుగోడు బీజేపీలో ముసలం.. ఈటల రాజేందర్ పై గొంగిడి టీమ్ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x