Gold Price today: వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సగటున నేడు (డిసెంబర్ 18) పది గ్రాముల బంగారం (Gold price in India) ధర (22 క్యారెట్​) రూ.47,720 వద్ద ఉంది. నిన్న (డిసెంబర్ 17) కూడా ధర ఇదే స్థాయిలో ఉండటం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫెడరల్​ రిజర్వ్ దుకుడుగా వ్యవహరిస్తున్నా.. బంగారం ధరల్లో వృద్ధి నమోదవుతూనే ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. రానున్న నెల రోజుల్లో బంగారం ధర 10 గ్రాములు రూ.49,500 స్థాయిని తాకొచ్చని అంచనా వేస్తున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..


హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం (Gold price in Hyderabad) ధర (22 క్యారెట్​) రూ.45,700గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర (22-క్యారెట్​) రూ.45,700 వద్ద (Gold price in Vijayawada) కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ బంగారం (Gold price in Vizag) పది గ్రాములు రూ.45,700 వద్ద ఉంది.


దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం ధరలు (22 క్యారెట్​) పది గ్రాములకు..


చెన్నైలో రూ.45,940 వద్ద ఉది. ముంబయిలో రూ.47,720 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో ఒక్క రోజులోనే బంగారం ధర (Gold price in Delhi) రూ.1000 తగ్గిది. ప్రస్తుతం ఇక్కడ ధర రూ.46,850 వద్ద ఉంది. బెంగళూరు, కోల్​కతాలో పసిడి ధర వరుసగా రూ. రూ.45,700, రూ.47,950 వద్ద కొనసాగుతోంది.


Also read: PF balance transfer: పాత పీఎఫ్ అకౌంట్​ బ్యాలెన్స్​ను కొత్త ఖాతాలోకి బదిలీ చేసుకోవడం ఎలా?


Also read: flipkart Big Saving Days: కిలో టమాటాల కంటే చీప్ గా స్మార్ట్ ఫోన్స్ అమ్మకం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook