Gold Price @ Rs 41,000: పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. రూ. 41,000కే 10 గ్రా. బంగారం
Gold Price @ Rs 41,000: మీరు బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి..? ఎంత ధర తగ్గింది..? పూర్తి వివరాలు ఇలా..
Gold Price @ Rs 41,000: ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఇష్టం బంగారంపై మనదేశంలోనే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే చచ్చేంత ప్రేమ. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల ముస్తాబు అయి బంగారు ఆభరణాలు ధరించి తెగ మురిసిపోతుంటారు. గత వారం ముందుకు వరకు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. వారం నుంచి మాత్రం తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్ర స్థిరంగా కొనసాగుతున్నాయి. మీరు కూడా బంగారం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ప్రస్తుతం బంగారం ధర 55 వేల రూపాయలకు చేరువలో ఉంది. మరోవైపు ఒక వారంలో వెండి ధర రూ.2500 కంటే ఎక్కువ తగ్గింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఎ) వెబ్‌సైట్ ప్రకారం.. మార్చి 6న బంగారం ధర 10 గ్రాములకు రూ.56,108గా ఉంది. మార్చి 11వ తేదీకి 10 గ్రాముల బంగారం ధర రూ.55,669కి పడిపోయింది. అంటే వారం మొత్తంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.439 తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,160 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 56,890 రూపాయలుగా ఉంది.
అదేవిధంగా వెండి ధరలు కూడా తగ్గాయి. మార్చి 6న కిలో వెండి ధర రూ.64,293గా ఉంది. కానీ మార్చి 11న కిలో వెండి ధర రూ.61,791కు పడిపోయింది. అంటే వెండి ధర రూ.2,502 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.68,700గా ఉంది. క్యారెట్‌ను బట్టి బంగారం ధర నిర్ణయిస్తారు. బంగారం మార్కెట్‌లో 18 క్యారెట్ల నుంచి 22, 23, 24 క్యారెట్ల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. 18 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.41,752గా ఉంది.
మీరు కూడా మార్కెట్‌లో బంగారాన్ని కొనుగోలు చేయబోతున్నట్లయితే.. హాల్‌మార్క్ చూసిన తర్వాత మాత్రమే గోల్డ్ కొనండి. బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి మీరు ప్రభుత్వ యాప్‌ను కూడా ఉపయోగించవచ్చు. 'బీఐఎస్ కేర్ యాప్' ద్వారా బంగారం స్వచ్ఛత నిజమో.. నకిలీదో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీరు మీ ఇంట్లో కూర్చొని గోల్డ్ రేట్‌ను చెక్ చేయవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇచ్చి బంగారం ధరలు తెలుసుకోవచ్చు.
Also Read: Dogs Attack on Boy: తెలంగాణలో దారుణం.. కుక్కల దాడిలో మరో బాలుడు మృతి
Also Read: Ex Minister Vijaya Rama Rao: మాజీ మంత్రి కన్నుమూత.. టీఆర్ఎస్ ఏర్పాటుకు కారణం ఆయనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook