Today Gold Rate: మన దేశంలోని మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో పెళ్లి జరిగినా, ఏదైనా శుభకార్యం జరిగినా ఖచ్చితంగా మగువులు బంగారాన్ని వేసుకుంటారు. కొంత భవిష్యత్తుల్లో ఏవైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు ఉపయోగపడుతుందని పసిడిని కొనుగోలు చేస్తారు. ఇందులో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలే. వీరు ఎప్పుడు గోల్డ్ ధర (Gold Price Today) తగ్గితే అప్పుడు కొనుగోలు చేసేందుకు చూస్తారు. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి ధరల్లో ఎన్ని హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నా గోల్డ్ ను కొనేందుకు వెనుకాడట్లేదు వినియోగదారులు. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవని గుర్తించుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశీయంగా బంగారం ధరలు:
>> దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది. 
>> ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర పసిడి ధర రూ.51,330 ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 ఉంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్లు రూ.51,050 వద్ద కొనసాగుతోంది. 


తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,000 ఉంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద కొనసాగుతోంది.
>> విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000గా ఉంది.


వెండి ధర:
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. కిలో వెండి రేటు ఢిల్లీలో రూ.57,500, ముంబైలో రూ.57,500గా ఉంటే... తెలుగు రాష్ట్రాల్లో రూ.63,000గా ఉంది. 


Also Read: UPI Payment: ఇక నుంచి ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook