Gold Price Today In Hyderabad On 27th January 2021:  జనవరి రెండో వారంలో బులియన్ మార్కెట్‌లో తగ్గిన బంగారం, వెండి ధరలు మూడో వారంలో మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, ఢిల్లీలో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Rate Today in Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.50,230 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం అంతే పెరిగింది. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.46,050గా మార్కెట్ అవుతోంది.


Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వివాదంలోనూ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చిన WhatsApp



దేశ రాజధాని ఢిల్లీలో బంగారం గత కొన్ని రోజులుగా క్షీణిస్తున్నాయి. అయితే గత మూడు రోజులుగా బంగారం ధర(Gold Price Today On 27th January 2021)లలో ఏ మార్పులేదు. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,460 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,080గా విక్రయాలు జరుగుతున్నాయి.


Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి



ఢిల్లీలో వెండి ధర తాజాగా పతనమైంది. తాజాగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ.200 మేర దిగొచ్చింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,500కి క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలో ఏ మార్పు లేదు. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర పతనం కాగా, నేడు సైతం అదే ధర రూ.71,300 వద్ద మార్కెట్ అవుతోంది.


Also Read: RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం 


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook