Gold Price Today, 3rd December 2020: నేటి బంగారం, వెండి ధరలు
Gold Rate Update 3 December 2020 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధరలు పుంజుకున్నాయి. మరోవైపు తాజాగా వెండి సైతం భారీగా ధరలు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.3,100 మేర భారీగా పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.67,700కి ఎగసింది.
Gold Price Today, 3rd December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మిశ్రమంగా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధరలు పుంజుకున్నాయి. మరోవైపు తాజాగా వెండి సైతం భారీగా ధరలు నమోదు చేసింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.50 మేర తగ్గింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,210కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,610 అయింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో డిసెంబర్ ఆరంభంలో బంగారం ధరలు (Gold Price in Delhi) మార్కెట్‌కు లాభాలు చేకూరుస్తున్నాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.280 మేర పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,600 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,300కి ఎగబాకింది.
Also Read: Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
బులియన్ మార్కెట్‌లో నవంబర్ నెలలో భారీగా క్షీణించిన వెండి ధరలు తాజాగా పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.700 మేర భారీగా పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.62,400 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.3,100 మేర భారీగా పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.67,700కి ఎగసింది.
Also Read: Motor Vehicle New Rules: వాహనదారులు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే!
Also Read: Bigg Boss 4 Contestants: ఓటింగ్ నెంబర్స్ ఇవే.. మిస్డ్ కాల్స్‌తో కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe