Gold Price Today September 8th 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఈ నెలలో రెండోసారి బంగారం ధర భారీగా దిగొచ్చింది. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.540 మేర ధర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620కి దిగి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ిప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:


తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఒకే ధరలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఈ మూడు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది.


దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,770గా ఉంది.


దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది.


మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,430 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,650గా ఉంది. 


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉంది. 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది. 


ఈ నెల 1వ తేదీన రూ.540 మేర తగ్గిన బంగారం ధర 9 రోజుల తర్వాత మళ్లీ అంతే స్థాయిలో దిగి వచ్చింది. అయితే అప్పటి ధరతో పోల్చితే ఇప్పుడు తగ్గింది కేవలం రూ.100, రూ.110 మాత్రమే. మొత్తంగా ఈ 10 రోజుల్లో 4 సార్లు ధరలు పెరగ్గా.. 5 సార్లు ధరలు దిగొచ్చాయి. తగ్గిన ధర రూ.1630 కాగా, పెరిగిన ధర రూ.650.  అంతర్జాతీయంగా డాలర్ విలువ మరింత బలపడటంతో బంగారం విలువ తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ పెరిగిన  ప్రతీసారి అది బంగారంపై నెగటివ్‌గా ప్రభావం చూపుతుంది.


Also Read: Horoscope Today September 8th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి..  


Also Read: Tagore Scene: చిరంజీవి 'ఠాగూర్' సీన్ రిపీట్.. మృతి చెందిన పేషెంట్‌కు వైద్యం.. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook