Gold Rate Today : శుక్రవారం పూట మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్
Gold Price Today In Hyderabad: బంగారం ధరలు ఆగస్టు 23వ తేదీ శుక్రవారం భారీగా ముఖం పట్టింది. ముఖ్యంగా పసిడి ధరలు నేడు హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,860 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,790 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధరలు దాదాపు ఒక తులంపై 400 రూపాయల వరకు తగ్గింది. బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి కాస్త ఉపశమనం బాట పట్టాయి.
Gold and Silver Price In Hyderabad : అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఒక ఔన్స్ 31 గ్రాములకు గాను 2550 డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుదల బాట పట్టడానికి ప్రధానంగా సెప్టెంబర్ నెలలో జరగనున్న అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీఎ కారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ లో జరిగే ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీలో వడ్డీరేట్లు శాతం మేర తగ్గిస్తారనే వార్తలు మార్కెట్లను కలవరానికి గురి చేస్తున్నాయి. దీంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వచ్చే నెలలో బంగారం ధర 2600 వందల నుంచి 2700 డాలర్ల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగినట్లయితే దేశీయంగా కూడా బంగారం ధరలు 80,000 మార్పును తాకే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారు కూడా నూతన గరిష్ట స్థాయిని చూసే అవకాశం ఉంది.
Also Read : KL Rahul Retirement: కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా..ఆ పోస్టు అర్థమేంటీ?
పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే దీపావళి సమయానికి బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా బంగారంపై పెట్టుబడి పెట్టాలంటే ఆభరణాల రూపంలోనే కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా కొనుగోలు చేయడం వల్ల పెరుగుతున్న బంగారంపై పెద్ద మొత్తంలో లాభాలను పొందలేమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే పెరుగుతున్న బంగారం ధరల నుంచి లాభాన్ని పొందాలనుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టినట్లయితే చక్కటి ఆదాయం పొందవచ్చని పైగా ఆ బాండ్లపై వడ్డీ ఆదాయం కూడా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సావరిన్ గోల్డ్ బాండ్లు అనేవి ఫిజికల్ గోల్డ్ కు ప్రత్యామ్నాయం బంగారం విలువతో కేంద్ర ప్రభుత్వం బాండ్లను జారీ చేస్తుంది. ఆ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా పెరుగుతున్న బంగారం ధరల నుంచి లాభాలను పొందే అవకాశం లభిస్తుంది. బంగారం ధర పెరిగే కొద్దీ బాండ్ విలువ పెరుగుతుంది మీకు అవసరం అయినప్పుడు బాండ్లను సరెండర్ చేసి డబ్బును పొందవచ్చు. ప్రతి సంవత్సరం మీ బాండ్ పై వడ్డీని కూడా చెల్లిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి