Gold Rate hiked by Rs 1760 in 20 days due to Marriage Season: ఇటీవలి రోజుల్లో పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న పసిడి ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. మంగళవారం (నవంబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 48,560లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,980లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ 9న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800లుగా ఉంది. సరిగ్గా 20 రోజుల తర్వాత అదే 10 గ్రాముల బంగారం ధర రూ. 48,560లు నమోదైంది. అంటే రూ. 1,760 పెరిగింది. మరోవైపు నవంబర్ 9న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050లుగా ఉంది. ఈరోజు రూ. 52,980లుగా నమోదైంది. అంటే రూ. 1,930 పెరిగింది. రేపటి నుంచి పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కానుండడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 


# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,710 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,140గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 48,560 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,980గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,470గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,970 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,610గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,030గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,560 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,980గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,560 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,980గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,560.. 24 క్యారెట్ల ధర రూ. 52,980గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 48,560 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,980 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు నేడు బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర కాస్త తగ్గింది. మంగళవారం (నవంబర్ 29) దేశీయంగా కిలో వెండి ధర రూ. 61,400లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 400 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 61,400లుగా ఉండగా.. చెన్నైలో రూ. 68,100లుగా ఉంది. బెంగళూరులో రూ. 68,100గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,100లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 68,100ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Horoscope Today 29 November 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!


Also Read: Chicken Marriage: చికెన్‌ పెట్టలేదని ఆగిన పెళ్లి.. చివరికి ఏం జరిగిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.