Todays Gold Rate: బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతున్నాయి. గత 24 గంటల్లో బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి క్రమంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. మధ్యలో స్వల్పంగా తగ్గినా..స్థూలంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటివి బంగారం ధర పెరగడానికి కారణమౌతుంటాయి. దాదాపు నెలరోజులుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధర భారీగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 100 రూపాయలుగా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 100 రూపాయలుగా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 750 రూపాయలుగా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 280 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 670 రూపాయలుంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుగా ఉంది.  


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 100 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది.  


Also read: Two Numbers One Sim: ఒకే సిమ్ తో రెండు నంబర్లు యాజ్ చేయడం ఎలానో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook