Todays Gold Rate: బంగారం ధర గత కొద్దిరోజులుగా పెరుగుతోంది. ఇవాళ మరోసారి భారీగానే పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరల పెరుగుదలకు వివిధ కారణాలుంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధర ప్రతిరోజూ మారుతుంటుంది. ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. దేశంలోని వివిధ నగరాల్లో పది గ్రాముల బంగారంపై 3 వందల నుంచి 7 వందల వరకూ పెరిగింది. 


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate)10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 50 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందల రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 650 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందల రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందల రూపాయలుంది. 


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (Hyderabad Gold Rate) 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 


Also read: Flipkart Big Bachat Dhamaal Sale: రూ.75,000 విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే పొందండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook