LPG Cylinder Cashback: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలపై క్యాష్ బ్యాక్ అందిస్తున్న Paytm మరియు Amazon
LPG Cylinder Cashback: ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రూ.125 మేర ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మీకు ఎల్పీజీ సిలిండర్ కొనుగోలుపై కొంత మేర ధర తగ్గినా ఉపశమనం కలుగుతుంది.
LPG Cylinder At Cheaper Prices: డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల ధర గత కొన్ని రోజులుగా భారీగా పెరిగింది. ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ వంటగ్యాస్ ధర ప్రస్తుతం రూ .819 కు లభిస్తుంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రూ.125 మేర ఎల్పీజీ సిలిండర్ ధర పెరగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
అలాంటి పరిస్థితిలో మీకు ఎల్పీజీ సిలిండర్ కొనుగోలుపై కొంత మేర ధర తగ్గినా ఉపశమనం కలుగుతుంది. డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం మొదటిసారి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌పై రూ .100 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మీరు పేటీఎం ద్వారా ఇప్పటివరకూ బుక్ చేయకపోతే, ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్ బుక్ బుకింగ్ చేసి రూ.100 డిస్కౌంట్ పొందండి.
అయితే LPG సిలిండర్లను బుక్ చేయడానికి ఆఫర్‌లో Paytm కొన్ని షరతులను విధించింది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ మొదటిసారి ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెండో అంశం ఏంటంటే.. మార్చి 31 వరకు మీరు కేవలం ఒక సిలిండర్ బుకింగ్ మాత్రమే చేయవచ్చు. చెల్లింపు తర్వాత మీకు లభించే స్క్రాచ్ కార్డ్‌ను 7 రోజుల్లోగా గీకేయాలి. లేదంటే స్క్రాచ్ కార్డు వ్యాలిడిటీ ముగిసిపోయి క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందలేరు. ఒకసారి మీకు లభించిన స్క్రాచ్ కార్డులో మీరు గెలిచిన మొత్తం 24 గంటల్లోపు మీ పేటీఎం వాలెట్(Paytm Wallet)లో జమ అవుతుంది.
ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌పై అమెజాన్ సైతం క్యాష్‌బ్యాక్(Amazon Cashback) ఇస్తోంది. మీరు మొదటిసారి అమెజాన్ నుండి ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ (Indane LPG cylinder)ను బుక్ చేసుకునే వారికి రూ .50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ట్వీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, పెరిగిన Silver Price
ముడి చమురు ధరలు ప్రభావంతో ఫిబ్రవరి నెలలో ఎల్పీజీ సిలిండర్ ధరలు మూడుసార్లు సవరించారు. సాధారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి మరియు 15 తేదీలలో ఎల్‌పీజీ ధరలను పెంచుతాయి. కానీ ఫిబ్రవరి 1న ధరలు పెరగలేదని సంతోషించే లోపే ఫిబ్రవరి 4న సిలిండర్ ధర రూ .25 పెరగడంతో రూ .719, మరో పది రోజుల తరువాత రూ.50 పెంచారు. అనంతరం మరో రూ.25 పెంచినట్లుగా ఇండియన్ ఆయిల్ ప్రకటించింది.
ఇంటి అవసరాలకు వినియోగించే సిలిండర్లను ఏడాదికి 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లు 12 సబ్సిడీ రేటుకు లభ్యమవుతున్నాయి. సామాన్యులకు కట్టెల పొయ్యిని దూరం చేసి మహిళల ఆరోగ్యాన్ని కాపడటంలో భాగంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద దేశ వ్యాప్తంగా మొత్తం 8 కోట్ల ఉచిత ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook