LPG Price Hike: తొలిరోజే పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, Hyderabad సహా మెట్రో నగరాలలో ధరలు ఇలా

LPG Gas Cylinder Price Hike Updates | తాజాగా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price) రూ.25 పెరిగింది. నెల తొలిరోజు నుంచే సామాన్యుడు ధరలతో పోరాటం చేయాల్సి వస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 1, 2021, 01:00 PM IST
LPG Price Hike: తొలిరోజే పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, Hyderabad సహా మెట్రో నగరాలలో ధరలు ఇలా

LPG Gas Cylinder Price Hike: సామన్యులకు మార్చి నెల తొలి రోజునే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓవైపు ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే, మరోవైపు ఎల్‌పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price) రూ.25 పెరిగింది. నెల తొలిరోజు నుంచే సామాన్యుడు ధరలతో పోరాటం చేయాల్సి వస్తోంది.

ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ.25 పెంపు
గత నెల ఫిబ్రవరిలో ఎల్పీజీ సిలిండర్ ధర మూడు సార్లు పెరగగా మొత్తం రూ.100 సామాన్యుడిపై భారం పడింది. ఇది చాలదన్నట్లుగా మార్చి నెల ప్రారంభంలోనే ఎల్‌పీజీ ధరల పిడుగు పడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫిబ్రవరిలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఫిబ్రవరి 4న, రెండవసారి ఫిబ్రవరి 14న, మరియు ఫిబ్రవరి 25న మరోసారి ధర పెంచింది. తాజాగా రూ. 25 మేర ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది.

Also Read: Changes From 1 March: ఎస్బీఐ, FASTag సహా ఈ అంశాలు మార్చి 1 నుంచి మారుతున్నాయి

LPG సిలిండర్ నేటి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా సవరించిన ధరలతో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.819కి చేరింది. గత నెలఖరు వరకు రూ.794గా కొనసాగిన ధర మార్చి 1న పెరిగింది. హైదరాబాద్‌లో రూ.821.50 అయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ .819 చెల్లించాలి. చెన్నైలో గరిష్టంగా రూ.835కు చేరింది.

Also Read: DA Hike Latest News: త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు

డిసెంబర్ నెలలో రూ.100 పెంపు
గత ఏడాది డిసెంబర్ నెలలో రెండు పర్యాయాలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. డిసెంబర్ 1న రూ.50 పెంచడంతో రూ .594 నుండి రూ .644 అయింది. ఆ తరువాత డిసెంబర్ 15న మరోసారి రూ.50 పెరగడంతో రూ .694కు చేరింది. జనవరిలో ఊరట ఇచ్చిన ఐఓఎల్ ఫిబ్రవరి 3 పర్యాయాలు ఎల్పీజీ ధర భారీగా పెంచేసింది. 

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పతనమైన బంగారం ధరలు, వెండి ధరలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News