Goldman Sachs: ఇండియన్ కంపెనీ జీవీకే బయోసైన్సెస్‌లో గోల్డ్‌మన్ శాక్స్ పెట్టుబడులు పెడుతోంది. భారత ఫార్మా రంగంలో గోల్డ్‌మన్ శాక్స్ గత కొద్దికాలంగా ప్రవేశిస్తోంది. మొన్న బయోకాన్..నేడు జీవీకే బయో సైన్సెస్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవీకే గ్రూప్(Gvk Group), ర్యాన్‌బాక్సీ మాజీ సీఈవో కలిసి జీవీకే బయో సైన్సెస్‌ను ప్రారంభించారు. ప్రమోటర్‌గా, ఛైర్మన్‌గా 2004లో జీవీకే బయోసైన్సెస్‌లో చేరారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 2 వేల 5 వందలకు పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఔషధ ఆవిష్కరణ, రసాయన, జీవశాస్త్రం, మాలిక్యూల్ పరిశోధన, అభివృద్ధి, రసాయనాల అభివృద్ధి, ఫార్ములేషన్, ఒప్పంద తయారీ విభాగాల్లో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2019-20లో 950 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థకు ఔషధ ఆవిష్కరణ, పరిశోధనపైనే సగం ఆదాయం లభిస్తోంది. మిగిలిందంతా కాంట్రాక్ట్ తయారీ విభాగం నుంచి వస్తోంది. 2014లో యూఎస్‌కు చెందిన ప్రీ క్లినికల్ కాంట్రాక్ట్ రీసెర్చ్ రంగంలో ఉన్న ఆరాజెన్ బయోసైన్సెస్‌ను కొనుగోలు చేసింది. 


ఇప్పుడీ సంస్థలో మరో ప్రముఖ కంపెనీ పెట్టుబడులు పెడుతోంది. గోల్డ్‌మన్ శాక్స్‌కు(Goldman Sachs) చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ 33 వాటా చేజిక్కించుకుంటోంది. క్రిస్ క్యాపిటల్ తనకున్న 17 శాతం వాటా, ప్రమోటర్లు 16 శాతం వాటాను విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. గోల్డ్‌మన్ శాక్స్ జీవీకే బయోసైన్సెస్‌తో(Gvk Bio Sciences) చేస్తున్న డీల్ విలువ 7 వేల 3 వందల కోట్లు. భారత ఫార్మా రంగంలో గోల్డ్‌మన్ శాక్స్‌కు ఇది రెండవ పెట్టుబడిగా ఉంది. గతంలో బయోకాన్ బయోలాజికల్స్‌లో 11 వందల కోట్లు పెట్టుబడి పెట్టింది. త్వరలో జీవీకే బయోసైన్సెస్‌లో గోల్డ్‌మన్ శాక్స్ పెట్టుబడులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. 


Also read: Gold Rate Today In Hyderabad 19 May 2021: మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, ఆకాశన్నంటుతున్న వెండి ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook