Edible Oil Prices: ఇండియాలో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా నూనె ధరలు తగ్గుతున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ధరలు పెరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొద్దికాలంగా వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి పన్నును తగ్గించడంతో దేశీయంగా ఆ ప్రభావం పడలేదు. అంతర్జాతీయంగా 1.95 శాతం నుంచి 7.17 శాతం వరకూ నూనె ధరలు పెరిగాయి. దేశంలో ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాక నూనె ధరలు 3.26 శాతం నుంచి 8.58 శాతం వరకూ పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గత నెలరోజుల్లో సోయాబీన్, పొద్దు తిరుగుడు, పామాయిల్, ఆర్ బీడీ పామోలిన్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. విదేశాల్నించి దిగుమతి చేసుకునే నూనెలపై సెప్టెంబర్ 11 నుంచి దిగుమతి పన్ను తగ్గించడంతో నూనె ధరలు(Edible Oil Prices)కూడా తగ్గాయి. ఇండియాలో గత ఏడాదిగా గోధుమల ధరలు కూడా తగ్గుతున్నాయి. హోల్‌సేల్, రిటైల్ ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. గోధుమలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం(Central government)పెంచింది. దేశీయంగా బియ్యం, గోధుమల ధరలు తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అటు పప్పు ధాన్యాల ధరలు మాత్రం పెరిగాయి. బంగాళాదుంప, ఉల్లిపాయలు, టమోటా ధర తగ్గింది.


Also read: Interest rates of Home loans: ఎస్బీఐ, ఐసిఐసిఐ, LIC HFL, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల్లో హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook