Bank Employees: బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు నెరవేరేందుకు మరో అడుగు దూరం మాత్రమే మిగిలింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదం లభిస్తే..బ్యాంకు ఉద్యోగులు ఎప్పట్నించో కోరుతున్న వారానికి ఐదురోజుల పనిదినాలు జూన్ నుంచే ప్రారంభం కావచ్చు. అంతేకాదు జీతం కూడా భారీగా పెరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగుల జీతాలు పెంచడం, వారానికి ఐదు రోజుల పనిదినాలను బ్యాంకు ఉద్యోగులు ఎప్పట్నించో కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బ్యాంకు యూనియన్లు లేఖ కూడా రాశాయి. ప్రస్తుతం దేశంలోని అన్ని బ్యాంకులకు నాలుగు ఆదివారాలతో పాటు రెండు, నాలుగు శనివారాలు సెలవులున్నాయి. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి ఆదివారంతో పాటు ప్రతి నెలలో రెండవ, నాలుగవ శనివారాలు బ్యాంకులకు సెలవులున్నాయి. 


వారానికి ఐదురోజుల పనిదినాల విషయంలో సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవడమే కాకుండా అనుకూలమైన నిర్ణయం తీసుకుని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ఆర్ధికమంత్రిని విజ్జప్తి చేశాయి. వారానికి ఐదురోజుల పనిదినాదుల ఆర్బీఐ, ఎల్ఐసీలో ఇప్పటికే అమలవుతోంది. 2015లో ఒప్పందం జరిగినప్పుడు మిగిలిన రెండు శనివారాల సెలవుల్ని కూడా త్వరలో పరిగణలో తీసుకంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం త్వరలో వారానికి ఐదురోజుల పనిదినాలపై అనుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు బ్యాంకు ఉద్యోగులకు గత ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలోని బ్యాంకు ఉద్యోగుల జీతాలు 17 శాతం పెంచేలా ఒప్పందం జరిగింది. 17 శాతం జీతం పెంచడం ద్వారా అదనంగా 12,449 కోట్లు ఖర్చు కానుంది. జీతం పెంపు నిర్ణయం తీసుకుంటే 3.8 లక్షల ఆఫీసర్లకు ప్రయోజనం కలగనుంది. 9 లక్షలమంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. 


Also read: Minister Sridhar Babu: ప్రావిడెన్స్‌లో 2500 మందికి కొత్తగా ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook