PPF New Rules: పీపీఎఫ్ ఎక్కౌంట్ మెచ్యూరిటీ కాకుండానే క్లోజ్ చేయలనుకుంటున్నారా..అయితే మోదీ ప్రభుత్వం ఇందులో కొన్ని మార్పుుల చేసింది. ముందస్తుగా ఎక్కౌంట్ క్లోజ్ చేసేవారికి ఉపశమనం కూడా కలగనుంది. గతంలో ఉన్నట్టు పీఎఫ్ ఎక్కౌంట్ ప్రీమెచ్యూర్ క్లోజర్‌పై జరిమానా ఇకపై ఉండకపోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీపీఎఫ్ ఎక్కౌంట్ ఏదైనా కారణాలతో ముందస్తుగా క్లోజ్ చేయాలనుకుంటే ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. కొత్త నిబంధనలు లేదా మార్పుల ప్రకారం ప్రీమెచ్యూర్ క్లోజర్ పెనాల్టీలో మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనలు నవంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చేశాయి. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ సవరణ పథకం 2023గా పిలుస్తారు. 15 ఏళ్ల ముందే పీపీఎఫ్ ఎక్కౌంట్ క్లోజ్ చేసే విషయంలో ఉన్న నిబంధనల్లో ఎలాంటి సందేహాలు లేవు కానీ పాత నిబంధనల ప్రకారం ఎవరైనా ఓ వ్యక్తి ఎక్కౌంట్ పొడిగించిన సమయంలో ఎక్కౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే ఎప్పట్నించి పొడిగించారో అప్పట్నించి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 15 ఏళ్ల తరువాత  ఒకటి కంటే ఎక్కువసార్లు 5 ఏళ్లకు ఎవరైనా ఎక్కౌంట్ పొడిగించి ఉంటే..ఎప్పుడైతే మొదటిసారి ఎక్కౌంట్ పొడిగించారో అప్పట్నించి పెనాల్టీ పడుతుంది. 


ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా ఓ వ్యక్తి 5 ఏళ్ల వ్యవధికి మూడుసార్లు ఎక్కౌంట్ పొడిగించుకుంటే మొదటిసారి పొడిగించిన తేదీ నుంచి విధించే 1 శాతం పెనాల్టీ ఉండదు. ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఇచ్చినప్పుడు ఏ ఐదేళ్ల పొడిగింపు వ్యవధిలో ఉందో ఆ కాలానికే జరిమానా ఉంటుంది. 


వాస్తవానికి పీపీఎఫ్ ఎక్కౌంట్ మెచ్యూరిటీ 15 ఏళ్లు ఉంటుంది. మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఎక్కౌంట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఐదేళ్ల వరకూ ఎక్కౌంట్ క్లోజ్ చేయడానికి వీల్లేదు. ఐదేళ్ల తరువాత ప్రత్యేక పరిస్థితుల్లో జరిమానా చెల్లించి ఎక్కౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. పీఎఫ్ నిబంధనల ప్రకారం మెచ్యూరిటీ కంటే ముందే ఎక్కౌంట్ క్లోజ్ చేస్తే వడ్డీపై 1 శాతం కోత ఉంటుంది. ఎక్కౌంట్ ఓపెన్ అయిన తేదీ నుంచి ఇది వర్తిస్తుంది. అంటే ఎవరైనా ఓ వ్యక్తికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంటే ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేస్తే 1 శాతం తగ్గి 6.1 శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. 


ఏయే పరిస్థితుల్లో క్లోజింగ్‌కు మినహాయింపు


ఎక్కౌంట్ హోల్డర్ లేదా కుటుంబ సభ్యుల అనారోగ్యం నిమిత్తం చికిత్స చేయించుకోవల్సినప్పుడు లేదా పిల్లల ఉన్నత చదువుకు డబ్బులు అవసరమైనప్పుడు. 


ఎక్కౌంట్ హోల్డర్ దేశం వదిలి వెళ్తున్నప్పుడు


పీపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ మరణించినప్పుడు నామినీ ఆ ఎక్కౌంట్ క్లోజ్ చేయవచ్చు.


Also read: Free Visa Entry: భారత పర్యాటకులకు గుడ్‌న్యూస్, ఇకపై ఈ దేశాలకు వీసా లేకుండానే ఎంట్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook