Good News for SBI Customers: ఒకప్పుడు వంద రూపాయలు విత్ డ్రా చేసుకోవాలి అన్నా కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బ్యాంకు వద్ద పదుల సంఖ్యలో జనాలు ఉంటే వారందరిని కూడా దాటుకుంటూ చాలా సమయం వెయిట్ చేసి అప్పుడు నగదు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. అకౌంట్ లో బ్యాలన్స్ చెక్ చేసుకోవడంకు కూడా బ్యాంక్ వద్ద చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఇప్పుడు బ్యాంక్‌ కు వెళ్లాల్సిన అవసరం దాదాపుగా 85 శాతం తగ్గిందనే చెప్పాలి. దాదాపు అన్ని బ్యాంకులు కూడా సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకుంటూ వినియోగదారులు ఎక్కడ ఉంటే అక్కడే సేవలు అందిస్తున్న విషయం తెల్సిందే. బ్యాలక్స్ ఎంక్వౌరీ మొదలుకుని కోట్ల రూపాయల వరకు ట్రాన్స్‌పర్‌ చేసుకునే వరకు పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.


బ్యాంక్ లావాదేవీలు అన్నీ కూడా మొబైల్‌ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమయంలో వినియోగదారులకు మరింత సులువైన సేవలను అందించేందుకు గాను ఎస్‌బీఐ వాట్సప్‌ ద్వారా సరికొత్త సేవలను అందించేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే చాలా బ్యాంక్‌ లు వాట్సప్ ద్వారా తమ వినియోగదారులకు సేవలను అందిస్తున్న విషయం తెల్సిందే. 


ఇప్పుడు ఎస్‌బీఐ కూడా దాదాపుగా 15 సేవలను వాట్సప్‌ ద్వారా అందించేందుకు రెడీ అయింది. బ్యాలన్స్‌ వివరాలు మొదలుకుని బ్యాంక్‌ హాలీడేస్‌ వరకు అన్ని విషయాలను కూడా వాట్సాప్ ద్వారా వినియోగదారులకు అందించేందుకు గాను ఎస్ బీ  ఐ వారు కొత్తగా ఈ సేవలను తీసుకు రావడం జరిగింది. దీంతో వినియోగదారులు మరింతగా లాభం పొందవచ్చు.


Also Read: Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ  


ఈ సేవలను పొందాలంటే ముందుగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్‌ బీ ఐ ఖాతా కు లింక్ ఉన్న ఫోన్‌ నెంబర్‌ నుండి ‘WAREG’ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి అకౌంట్‌ నంబర్‌ను టైప్‌ చేసి.. 72089 33148 నంబర్‌కు పంపించాల్సి ఉంటుంది. వెంటనే కన్ఫర్మేషన్‌ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత వాట్సప్‌ లో 9022690226  నెంబర్‌కి హాయ్ అని మెసేజ్‌ చేసి అక్కడ మీ ఖాతాకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 


వాట్సప్ ద్వారా బ్యాంక్‌ హాలిడేస్‌, బ్యాంక్‌ బ్యాలెన్స్‌, మినీ స్టేట్‌మెంట్‌, అకౌంట్‌ స్టేట్‌మెంట్‌, ఇతర స్టేట్‌మెంట్‌లు, రుణ వివరాలు, డిపాజిట్‌ వివరాలు, పెన్షన్ స్లిప్, ఎన్‌ఆర్‌ఐ సేవలు, ఏటీఎం సేవలు, ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్‌, ప్రీ అప్రూవ్డ్‌ లోన్లు, బ్యాంక్‌ ఫారాలు, డెబిట్‌ సేవలు, కాంటాక్టులు, హెల్ప్‌లైన్‌ నంబర్లు, అకౌంట్‌ నిలిపివేత వంటి సేవలను పొందవచ్చు. మరెందుకు ఆలయ్యం మీరు ఎస్ బీ ఐ యూజర్లు అయితే వెంటనే రిజిస్ట్రార్ అవ్వండి.


Also Read: World Cup 2023:  భారత్‌ - పాక్ మ్యాచ్‌.. 10 సెకన్ల యాడ్ ప్లేకి రూ.30 లక్షలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook