Good News for SBI: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్
దేశీయ అతి పెద్ద బ్యాంక్ గా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ సంస్థ క్రెడిట్ కార్డు యూపీఐ పేమెంట్స్ కు అంగీకరించింది. ఈ నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు
Good News for SBI Credit Card Holders: గత రెండు మూడు సంవత్సరాల్లో యూపీఐ చెల్లింపులు భారీ ఎత్తున పెరిగాయి. అయిదు పది రూపాయలు మొదలుకుని వేల రూపాల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కొన్ని సార్లు లక్షల రూపాయలను కూడా యూపీఐ ద్వారా చెల్లిస్తూ ఉన్నారు. దేశంలో యూపీఐ చెల్లింపులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే చాలా బ్యాంక్ లు తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. యూపీఐ చెల్లింపులు చేసుకోవాలి అంటే డెబిట్ కార్డును ఎలా అయితే ఫోన్ పే, గూగుల్ పేలో రిజిస్టర్ చేసుకుంటారో అలాగే క్రెడిట్ కార్డును కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ చెల్లింపుల కోసం గత కొన్నాళ్లుగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఎస్‌బీఐ వారికి కూడా క్రెడిట్ కార్డు యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దేశీయ అతి పెద్ద బ్యాంక్ గా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ కార్డులో ఉన్న నగదును వినియోగించుకునేందుకు యూపీఐ యాప్స్ ను వినియోగించే వెసులు బాటు ఉంటే కార్డు వినియోగం మరింత ఎక్కువ అవుతుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ వెసులు బాటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటూ ఇక ముందు మరింత ఎక్కువగా బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎస్ బీ ఐ అధికారులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ బీ ఐ క్రెడిట్ కార్డును కలిగి ఉన్న వినియోగదారులు తమ యూపీఐ యాప్స్ అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఇతర యాప్స్ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు ను ఎంత సులువుగా రిజిస్టర్ చేసుకుంటారో అంతే సులువుగా క్రెడిట్ కార్డును కూడా రిజిస్టర్ చేసుకునే వీలు ఉంది.
Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?
క్రెడిట్ కార్ట్ ద్వారా యూపీఐ సేవలు కేవలం మర్చంట్లకు అంటే షాప్ వారికి మాత్రమే పేమెంట్లు చేసుకునే వీలు ఉంటుంది. అంతే కానీ బ్యాంక్ అకౌంటర్లకు డబ్బులు ట్రాన్సపర్ చేసుకునే వీలు ఉండదు అని ఎస్ బీ ఐ అధికారులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డ్ ఉన్న వారు తమ అకౌంట్స్ లోకి అమౌంట్ ను పంపుకునే వీలు ఉండదు. కేవలం షాపింగ్స్ కు వెళ్లినప్పుడు మాత్రమే ఈ విధానం ఉపయోగపడుతుంది. ఇష్టానుసారంగా అకౌంట్స్ లోకి అమౌంట్ ను ట్రాన్స్‌పర్ చేసుకునే అవకాశం లేదని దీంతో వెళ్లడి అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి