కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank Of India) తమ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఎస్‌బీఐ ఉద్యోగులలో 2.5 లక్షల మందికి బోనస్ అందించనుంది. దాదాపు 15 రోజుల వేతనాన్ని ఆ ఉద్యోగులకు అదనంగా అందించనున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యుత్తమ ప్రదర్శన చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఈ బోనస్ ప్రయోజనాలు పొందనున్నారని టైమ్స్ నౌ రిపోర్ట్ చేసింది. దాని ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2020-21 మెరుగైన సేవలు అందించి, అత్యుత్తమ ప్రదర్శన చేసిన 2.5 లక్షల ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా అందించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ సిద్ధమైనట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరానికి, అంతకు ముందు ఆర్థిక సంవత్సరానికి భారతీయ స్టేట్ బ్యాంకు (State Bank Of India) లాభాలు 41 శాతానికి పెరిగాయి. దీంతో తమ ఉద్యోగులకు ప్రయోజనాలు అందించనుంది.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు, మళ్లీ క్షీణించిన వెండి ధరలు


ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నవంబర్ 2020లో ఓ ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు నెట్ ఫ్రాఫిట్‌లో వృద్ధి సాధిస్తే మెరుగైన ప్రదర్శన చేసిన తమ ఉద్యోగులకు బ్యాంకులు అదనపు ప్రయోజనాలు కల్పించాలన్నది ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు 5 నుంచి 10 శాతం వృద్ధి సాధిస్తే ఉద్యోగులకు 5 రోజుల వేతనం, బేసిక్ శాలరీ మరియు డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) రూపంలో అందిస్తుంది. 


Also Read: DIPCOVAN kit price: DRDO తయారుచేసిన డిప్‌కొవాన్ టెస్ట్ కిట్ ధర ఎంత, ఎలా పనిచేస్తుంది ?


ఒకవేళ బ్యాంకు నెట్ ప్రాఫిట్ వృద్ధి 10 నుంచి 15 శాతం నమోదు చేస్తే మెరుగైన ప్రదర్శన చేసిన ఉద్యోగులకు 10 రోజుల వేతనం బోనస్‌ (SBI Benefits)గా లభిస్తుంది. 15 శాతాన్ని మించితే ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.14,488.11 కోట్లు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి అది రూ.20,110.17 కోట్లకు పెరిగింది. 41 శాతానికి నెట్ ప్రాఫిట్ వృద్ది చెందడంతో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పందం ప్రకారం మెరుగైన ప్రదర్శన తమ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 రోజుల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనుందని టైమ్స్ నౌ రిపోర్ట్ చేసింది. ఒకవేళ నెట్ ప్రాఫిట్ వృద్ది 5 శాతం లోపే ఉంటే ఉద్యోగులకు ఎలాంటి బోనస్ లభించదు.


Also Read: White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook