UPI Lite App: ఆన్‌లైన్ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా NPCI కీలక నిర్ణయం తీసుకుంది. పలు బ్యాంకు ఖాతాలను ఒకే మొబైల్‌ ఫ్లాట్‌పామ్‌ కిందకు తీసురావడానికి ఎన్‌పీసీఐ యూపీఐ ను పరిచయం చేసింది. నేటికీ డిజిటల్‌ చెల్లింపుల మోడ్‌లో స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న యూపీఐ సేవలను ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకు కూడా పరిచయం చేసింది నేషనల్ పేమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని కోసం డిజిటల్ చెల్లింపులకు ఇంటర్నెట్‌ అవసరం లేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌ కూడా ఎలాంటి ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ చెల్లింపులు చేసేందుకు వీలుగా ఎన్‌పీసీఐ యూపీఐ లైట్‌ - ఆన్‌ డివైజ్‌ వ్యాలెట్‌ పేరుతో యాప్‌ను తీసుకురానునట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాప్‌ పరీక్షల దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. దీంతో ఎలాంటి ఇంటర్నెట్‌ లేకుండా సులభంగా చెల్లించొచ్చని తెలిపారు.


యూపీఐ లైట్‌తో లాభమెంత...?
భారత్‌లో రోజుకి ఒక బిలియన్‌ యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఎన్‌పీసీఐ నివేదిక తెలిపింది. యూపీఐ చెల్లింపులు ప్రజలు భారీగా వినియోగిస్తున్నందున దానికి తగినట్లుగానే బ్యాంకులు తమ చెల్లింపుల వ్యవస్థకు సంబంధించి పలు సదుపాయాల్లో మార్పులు చేసుకోవాల్సి అవసరం ఎంతగానో ఉంది. దీనికోసం భారీగా ఖర్చు చేయాలి. దీని వల్ల బ్యాంకులపై తీవ్ర భారం పడే అవకాశాలున్నాయి.


ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఎన్‌పీసీఐ యూపీఐ లైట్‌ యాప్‌ను తీసుకొస్తోంది. అయితే ఇది సాధారణ యూపీఐ యాప్‌లో ఆన్‌లైన్‌ ఉపయోగించి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ యూపీఐ లైట్‌ యాప్‌లో ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు. అయితే ఈ యాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ను మాత్రం స్కాన్‌ చేయలేరని సమాచారం.  


యూపీఐ లైట్ లిమిట్‌ చెల్లింపు ఎంత..?
యూపీఐ యూజర్స్‌ అందరు యూపీఐ లైట్‌ యాప్‌ను ఉపయోగించవచ్చు. అయితే దీనిని వాడలంటే  ఆన్‌ డివైజ్‌ వ్యాలెట్‌ను ఎనేబుల్ చేయ్యాల్సి ఉంటుంది.దీంతో బ్యాంకు ఖాతా నుంచి  నగదు లైట్‌ యూప్‌లో జమ అవుతుంది. యూపీఐ లైట్‌ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాక తొలి దశలో డెబిట్‌ చెల్లింపులు డిజిటల్‌ ద్వారా క్రెడిట్‌ చెల్లింపులన్ని డిజిటల్‌లో జరుగుతాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది.


అయితే రెండో దశలో అన్ని రకాల చెల్లింపులు ఆఫ్‌లైన్‌లో జరుగుతాయని తెలిపింది.ఈ నగదు చెల్లింపులపై కూడా ఎన్‌పీసీఐ పరిమితి విధించింది. కేవలం రూ. 200లోపు చెల్లింపులు మాత్రమే ఈ యాపీఐ లైట్ యాప్‌ ద్వారా జరుగుతాయని వెల్లడించింది.


Also Read: Paritala Sunitha: ఆ కంపెనీ నుంచి వైసీపీ ఎమ్మెల్యే రూ.15 కోట్లు డిమాండ్ చేశాడు.. పరిటాల సునీత సంచలన ఆరోపణలు


Also Read: Ashleigh Barty Retires: అతిచిన్న వయసులోనే టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన యాష్లే బార్టీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook