iPhones price drop: ఐఫోన్.. చాలా మంది యూత్​కు ఇదో లగ్జరీ ఐటం. ఖరీదు ఎక్కువ కాబట్టి ఎంతో ఇష్టమున్నా దానిని కొనుగోలు చేయరు. కొంతమందేమో.. ఐఫోన్ కోసమే ప్రత్యేకంగా సేవింగ్స్ చేస్తుంటారు. అయితే అలా ఐఫోన్ కొనాలనే కొరిక ఉన్నా.. రేటు కారణంగా వెనక్కి తగ్గే వాళ్లకు గుడ్​ న్యూస్​. రూ.15లకన్నా తక్కువ ధరకు ఐఫోన్​ కొనుగోలు చేసే అవకాశం రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంత తక్కువ ధరకు ఎందుకు?


యాపిల్ ఇప్పటికే బడ్జెట్​ సెగ్మెంట్​లో ఫోన్లను విడుదల చేస్తోంది. ఎస్​ఈ, ఎస్​ఈ2 వంటి మోడళ్లు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పడు తాజాగా ఎస్​ 3 (2022)ను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది యాపిల్. మార్చి 8న ఈ ఐఫోన్​ ఎస్​ఈ3ని విడుదల చేయొచ్చని అంచనాలు ఉన్నాయి.


అయితే ఎస్​ఈ సెగ్మెంట్​లో అప్​డేట్ వెర్షన్​గా ఈ ఎస్​ఈ3 అందుబాటులోకి రానుంది. దీనితో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎస్​ఈ, ఎస్​ఈ2ల ధరలు భారీగా తగ్గొచ్చని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్​ఈ 2022 మోడల్​ను రూ.15 అంతక్నా తక్కువ ధరకే విక్రయించొచ్చని సమాచారం.


బ్రాండ్​ న్యూ ఐఫోన్​ రూ.15 వేలకు లభించడం అంటే.. ఐఫోన్ లవర్స్​కు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. 


బడ్జెట్ మోడల్​ ఐఫోన్​ ఎస్​ఈ 2 (2020)ని గత ఏడాది రూ.42,500లకు మార్కెట్లోకి విడుదల చేసింది యాపిల్​. ఇప్పటికే ఈ ఫోన్ ధర ఫ్లిప్​కారక్ట్​లో దాదాపు రూ.27 వేలకు లభిస్తోంది. ఐఫోన్ 2022 మార్కెట్లోకి వస్తే.. దీని ధర రూ.15 వేలకు దిగిరావచ్చని అంచనాలు ఉన్నాయి. ఐఫోన్​ 2022 ధరను రూ..22,517గా ఉంచొచ్చని కూడా తెలుస్తోంది.


అయితే ఐఫోన్ ఎస్​ఈ 2022 విడుదల తేదీ గురించి గానీ, పాత మోడళ్ల ధరల తగ్గింపు గురించి గానీ అధికారిక ప్రకటన చేయలేదు యాపిల్​.
ఐఫోన్ 2022 గురించి..


  • 5జీ వేరియంట్​

  • 4.7 అంగుళాల డిస్​ప్లే

  • 64 జీబీ స్టోరేజ్​

  • 12 మెగా పిక్సెల్​తో రియర్, సెల్ఫీ కెమెరాలు

  • యాపిల్​ ఏ 15 బయోనిక్ చిప్​సెట్​


Also read: Flipkart Symphony Cooler: ఏసీలా గోడకు ఫిట్ చేసుకునే కూలర్.. కేవలం రూ.12,824 మాత్రమే!


Also read: LPG Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్​ సిలిండ‌ర్ ధర.. నేటి నుంచే అమల్లోకి! వినియోగదారులకు చుక్కలే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook