Flipkart Symphony Cooler: ఏసీలా గోడకు ఫిట్ చేసుకునే కూలర్.. కేవలం రూ.12,824 మాత్రమే!

Flipkart Symphony Cooler: రాబోయే సమ్మర్ కోసం ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రత్యేక సేల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ లో ఏసీ తరహా గోడకు ఫిక్స్ చేసుకునే కూలర్ ను కేవలం రూ.12,824లకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సింఫనీ కూలర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 10:37 AM IST
    • సమ్మర్ కోసం ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో ప్రత్యేక ఆఫర్లు
    • ఏసీ లాంటి ఫీచర్లతో గోడకు ఫిక్స్ చేసుకునే కూలర్
    • రూ.12,824 ధరకు కూలర్ ను విక్రయిస్తున్న ఫ్లిప్ కార్ట్!
Flipkart Symphony Cooler: ఏసీలా గోడకు ఫిట్ చేసుకునే కూలర్.. కేవలం రూ.12,824 మాత్రమే!

Flipkart Symphony Cooler: మహాశివరాత్రి రానే వచ్చింది. ఇక ఈ పండుగ తర్వాత ఎండల ప్రభావం మరింత పెరగనుంది. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న క్రమంలో మార్చి నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో రాబోయే కాలం మరింత వడగాలులు తీవ్రంగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వేడి గాలుల నుంచి మనల్ని మనం తప్పించుకోవడానికి ఇంటికి ఎయిర్ కండిషన్ లేదా ఎయిర్ కూలర్ తెచ్చుకోవడం మంచిది. 

ఎయిర్ కండిషనర్ (ఏసీ) పరికరాన్ని ప్రజలందరూ కొనలేరు. కానీ, వడగాలుల బారి నుంచి తప్పించుకునేందుకు కనీసం కూలర్ అయినా కొనేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే కూలర్ తో ఏసీ అంతటి చల్లదనం పొందవచ్చు. మరొక విషయం ఏంటంటే.. సాధారణంగా కూలర్ ను నేలపై ఉంచుతారు. ఏసీని గోడకు బిగిస్తారు. కానీ, ఏసీలా గోడకు ఫిక్స్ చేసుకునే కూలర్ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది. 

భారతదేశంలో తొలిసారిగా ఏసీ తరహ కూలర్ ను సింఫనీ సంస్థ ప్రవేశపెట్టింది. ఇది ఏసీ అంతటి చల్లదనాన్ని ఇవ్వడం సహా విద్యుత్ ను కూడా తక్కువ ఖర్చు చేస్తుంది. అంతే కాకుండా దీన్ని ఎయిర్ కండిషనర్ లాగా రిమోట్ తో ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంది. మిగతా కూలర్ల మాదిరిగా ప్రతిరోజూ దీనికి నీళ్లు పట్టాల్సిన పనే లేదు. అయితే ఈ గోడకు ఫిక్స్ చేసే కూలర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

రిమోట్‌తో సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్

సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్ సామర్థ్యం 15 లీటర్లు. అంటే, ఇందులో 15 లీటర్ల నీటి ట్యాంక్ ఉంది. ఇది దాదాపు 2000 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు చల్లని గాలిని ప్రసరిస్తుంది. దీనికి మూడు వైపుల కూలింగ్ ప్యాడ్‌తో కప్పబడి ఉంటుంది. గాల్లోని తేమను తొలగించడం సహా..  డీహ్యూమిడిఫైయింగ్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. దీనిలోని రిమోట్ సెన్సింగ్ సిస్టమ్ కారణంగా దీన్ని ఆపరేట్ చేసేందుకు పదే పదే దాని దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. 

సింఫనీ క్లౌడ్ కూలర్ ధర

రిమోట్‌తో కూడిన సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్ ను మార్కెట్లో రూ. 14,999 నుంచి విక్రయిస్తున్నారు. అయితే ఇది ఫ్లిప్‌కార్ట్ లో 10 శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు రూ.13,499లకే అందుబాటులో ఉంది. దీంతో పాటు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే దీని ద్వారా రూ. 675 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్లతో కలుపుకొని చివరగా.. సింఫనీ క్లౌడ్ కూలర్ రూ. 12,824కే కొనుగోలు చేయవచ్చు.  

Also Read: BSNL Recharge Plan: BSNL బంపర్ ఆఫర్.. రూ.197 రీఛార్జ్ తో 100 రోజుల వ్యాలిడిటీ!

Also Read: Flipkart Electronics Sale: రూ.21 వేల విలువైన స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ.5 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News