Cheap Air Fares: విమాన ప్రయాణికులకు బంపరాఫర్.. బిర్యానీ ధరకే విమాన ప్రయాణం

Cheap Cost Under UDAN Scheme For Air Journey: మీరు బిర్యానీ తినే ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు. మీరు కాఫీ తాగినంత చవకకే విమానంలో ఎగిరిపోవచ్చు. రూ.349కే విమాన ప్రయాణం టికెట్ అందుబాటులోకి వచ్చింది.
Biryani Cost Fly Journey: విమాన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఓ విమానయాన సంస్థ శుభవార్త తెలిపింది. అత్యంత చవకకే విమాన ధర అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ధర ఎంతంటే మీరు ఒక బిర్యానీ తిన్నంత ధరకే విమాన టికెట్ లభిస్తోంది. ఈ ప్రయాణం ఎక్కడో తెలుసా? అసోంలోని లిలాబరి నుంచి తేజ్‌పూర్ మధ్య ప్రయాణానికి ఈ టికెట్ ధర లభిస్తుండడం విశేషం. అయితే అంత తక్కువ ధర ఎందుకు ఏమిటో తెలుసుకోండి.
Also Read: Revanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్.. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలం
రూ.329 చార్జీలో కనీస ధర రూ.150 ఛార్జీ ఉండగా.. కన్వినీయెన్స్ ఛార్జీ కింద రూ.199 వసూలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయాణం కొన్ని మార్గాల్లో మాత్రమే ఉన్నాయి. రూ.వెయ్యి కంటే తక్కువ బేస్ టికెట్ ధరతో దేశంలో విమాన సేవలు నడుస్తున్నాయి. ఈ విమానాలన్నీ ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం (ఉడాన్) పథకం కింద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. టికెట్ ధర ఎక్కువ ఉండగా.. పలు ప్రోత్సాహకాలు అందుతుండడంతోనే తక్కువ ధర ఉంది.
Also Read: Sri Rama Navami: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. భద్రాచలంలో పట్టువస్త్రాల సమర్పణకు బ్రేక్
ఒక వ్యక్తికి రూ.వెయ్యి కంటే తక్కువ బేస్ ధరతో దేశంలో 22 విమాన మార్గాల్లో రాకపోకలు సాగుతున్నాయి. వీటిలో అత్యంత తక్కువ ధర లిలాబరి-తేజ్‌పూర్ మధ్య ఉందని ట్రావెల్ పోర్టల్ ఐక్సిగో వెల్లడించింది. ఆ మార్గంలో రూ.150 బేస్ ఛార్జీ ఉండగా.. టికెట్ బుకింగ్ సమయంలో బేస్ చార్జీకి అదనంగా కన్వీయెన్స్ చార్జీ వసూలు చేస్తారు. ఉడాన్ పథకంలో నడిచే విమానాల ప్రయాణ సమయం కేవలం 50 నిమిషాలు ఉంటుంది. అయితే అతి తక్కువ విమాన ధర ప్రయాణ సదుపాయం దేశంలోని ప్రధాన నగరాలకు లేదు.
ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా తక్కువ ధర కలిగిన విమాన ప్రయాణాలు కొనసాగుతున్నాయి. లిలాబారి-తేజ్‌పూర్ మాదిరి ప్రయాణ మార్గాలు ఉన్నాయి. గుహవాటి-షిల్లాంగ్ మధ్య బేస్ టికెట్ ధర రూ.400 ఉంది. ఇక దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఉడాన్ పథకం కింద విమాన ప్రయాణాలు కొనసాగుతున్నాయి. బెంగళూరు-సేలం మధ్య ప్రయాణానికి బేస్ ధర రూ.525 ఉండగా.. కొచ్చి-సేలం మార్గంలో మరింత తక్కువగా బేస్ ధర ఉంది. ఉడాన్ పథకంలో టికెట్ల ధరలు తెలుసుకుని అక్కడి పర్యటనకు వెళ్తే మీకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఉడాన్ పథకం కింద అమలుచేస్తున్న విధానం ప్రధాన నగరాలకు కూడా వర్తింపజేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter