Sri Rama Navami 2024: భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవాలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ ముఖ్యమంత్రి చేయకూడదని తేల్చి చెప్పింది. ఇక ఉత్సవాలు ప్రత్యక్ష చేయరాదని ఆదేశించింది. దీంతో భక్తులతోపాటు ప్రభుత్వ యంత్రాగానికి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ముఖ్యమంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు కూడా ఉత్సవాలకు రాలేకపోవచ్చు.