Google Pay Loans: గూగుల్ పే నుంచి చిన్న మొత్తం రుణాలు, ఇలా అప్లై చేయండి
Google Pay Loans: దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్ వినియోగం ఎక్కువగా కన్పిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు యూపీఐ యాప్స్ తాజాగా రుణ సౌకర్యం కూడా అందిస్తున్నాయి.
Google Pay Loans: దేశంలో ప్రముఖ యూపీఐ యాప్ గూగుల్ పే గురించి అందరికీ తెలిసిందే. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు అందించే గూగుల్ పే ఇప్పుడు కొత్తగా లోన్ ఫెసిలిటీ కల్పిస్తోంది. గూగుల్ కల్పిస్తున్న ఈ అవకాశం చిరు వ్యాపారులకు చాలా ఉపయోగపడనుంది. దాదాపు లక్ష రూపాయల వరకూ లోన్ పొందవచ్చు.
చిరు వ్యాపారస్థులకు ప్రతి రోజూ ఎంతో కొంత నగదు కావల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్యాంకుకు వెళ్లి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చిరు వ్యాపారులకు లోన్ సౌకర్యం కల్పించేందుకకు గూగుల్ పే ముందుకొచ్చింది. గూగుల్ సాచెట్ లోన్స్ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. గూగుల్ సాచెట్ లోన్స్ ద్వారా కనీసం 10 వేల నుంచి 1 లక్ష వరకూ రుణం పొందవచ్చు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు 7 రోజుల్నించి 12 నెలల కాలవ్యవధి కూడా ఉంటుంది.
గూగుల్ సాచెట్ లోన్ కావాలంటే ముందుగా గూగుల్ పే బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. గూగుల్ పే యాప్‌లో క్రెడిట్ విభాగంలో వెళ్లి అక్కడున్న ఆఫర్స్ సెక్షన్ క్లిక్ చేయాలి. మీకు కావల్సిన లోన్ మొత్తాన్ని ఎంటర్ చేసి కంటిన్యూ అవాలి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు నమోదు చేయాలి. అప్లికేషన్‌లో సూచించే విధంగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. సిబిల్ స్కోర్ 750 దాటితేనే గూగుల్ సాచెట్ లోన్ పొందేందుకు అర్హత ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook