Google Pay Tips: ఆన్​లైన్ పేమెంట్​ యాప్​లలో గూగుల్ పే గురించి తెలియని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్​ఫోన్ వాడుతున్న దాదాపు అందరూ ఈ యాప్ (Online Payment Apps)​ వినియోగిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం మొబైల్ నంబర్​ను ఉపయోగించి ఒక వ్యక్తి మరో వ్యక్తికి డబ్బులు పంపించుకునే సదుపాయం ఉండటమే ఇందుకు (Online Money Transfer) కారణం. అయితే ప్రస్తుతం ఇదే సేవలను చాలా యాప్​లు అందిస్తున్నా.. గూగుల్​పేకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.
గూగుల్​పే మొదట తేజ్​ పేరుతో (Tez app) సేవలందించిన విషయం తెలిసిందే.


ఈ యాప్​ మనీ ట్రాన్స్​ఫర్​ సేవలే కాకుండా స్క్రాచ్​ కార్డ్​ల రూపంలో (G pay scratch card)​ క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇస్తూ యూజర్లను ఆకర్షిస్తుంటుంది.


యాప్​ తొలినాళ్లలో క్యాష్​ బ్యాక్​లు మాత్రమే వచ్చేవి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్​లతో పాటు గిఫ్ట్ ఓచర్​ల వంటివి కూడా ఇస్తోంది గూగుల్​పే. అయితే ఇటీవలి కాలంలో క్యాష్​ బ్యాక్​లు భారీగా తగ్గాయి. స్క్రాచ్​  కార్డ్​లలో ఎక్కవ శాతం 'Better Luck Next Time' అనేవే కనిపిస్తున్నాయి.


ఇలా ఎందుకు జరుగుతుంది? గూగుల్​ పేలో క్యాష్​ బ్యాక్​లు ఎక్కువగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలని అనే విషయంపై కొంత మంది విశ్లేషకులు చెబుతున్న సలహాలను ఇప్పుడు (Tips for Google pay Cash Back) పరిశీలిద్దాం.


గూగుల్​పే క్యాష్​ బ్యాక్ టిప్స్​..


గూగుల్​పేలో మంచి క్యాష్​ బ్యాక్ రావాలంటే.. ముందుగా మీరు ఒకే అకౌంట్ (ఒకే యూజర్​తో) నంబర్​తో ఎక్కువ సార్లు లావాదేవీలు జరపొద్దు. అలా చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అకాశాలు తగ్గిపోతుంటాయి. అందుకే కొత్త అకౌట్లతో లావాదేవీలు జరపడం ద్వారా క్యాష్​ బ్యాక్ పొందే అవకాశాలు ఎక్కువగా (Cash Back offers in G Pay) ఉంటాయి.


ఒకే సారి భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్స్​ చేయడం కూడా క్యాష్​ బ్యాక్ ఆఫర్లు తగ్గేందుకు కారణం కావచ్చు. అలా జరగకుండా.. తక్కువ మొత్తంలో ట్రాన్సక్షన్స్​ చేయడం వల్ల క్యాష్​ బ్యాక్ ఆఫర్లు ఎక్కువగా (Don'ts in Google Pay) పొందొచ్చు.


ఎక్కువగా వినియోగంలో లేని ఖాతాతో లావాదేవీలు జరపడం కూడా క్యాష్​ బ్యాక్​లు తగ్గేందుకు కారణం కావచ్చు. అలా కూకుండా.. రెగ్యులర్​గా వినియోగంలో ఉన్న అకౌంట్​కు, గూగుల్​ పేను అధికంగా వినియోగించే అకౌంట్లలతో లావాదేవీలు జరపడం ద్వారా క్యాష్​ బ్యాక్​లు అధికంగా పొందే (How to Get Best Cash bank in G Pay) వీలుంది.


సింగిల్​ డిజిట్ అమౌంట్​ ట్రాన్సాక్షన్​ చేయడం వల్ల క్యాష్​బ్యాక్ పొందలేరు. అందుకే కనీసం రూ.150 నుంచి రూ.500 మధ్య ట్రాన్సాక్షన్​ చేయడం ద్వారా క్యాష్​ (Minimum Amount for Cash back in Google Pay) బ్యాక్ పొందొచ్చు.


Also read: Gold Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు... ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..


Also read: Amazon sale: రూ. 14 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీ, రూ. 20 వేలకే 42 ఇంచుల స్మార్ట్ టీవీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook