LPG Gas Cylinder Rates: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. కొత్త రేట్లు ఇలా..
LPG Gas Rates Today: వ్యాపారస్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా తగ్గించింది. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..
LPG Gas Rates Today: నిత్యం పెరుగుతున్న ధరలతో సతమవుతున్న ప్రజలకు నవంబర్ మొదటి తేదీ ఉపశమనం కలిగించింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రభుత్వం తగ్గించింది. దేశీయ ఎల్‌పీజీ ధరలను తగ్గించలేదు. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.115.50 తగ్గించింది. ఇక జూలై 6 నుంచి డొమెస్టిక్ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
19 కిలోల ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ పాత ధర కొత్త ధర రూ.1859 కాగా.. ప్రస్తుతం రూ.115.50 తగ్గించడంతో 1744 రూపాయలకు చేరుకుంది. గ్యాస్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు చేస్తాయి. కమర్షియల్ సిలిండర్లను హోటళ్లు, ఫుడ్ షాపుల్లో ఉపయోగిస్తారు. దీంతో వ్యాపారులకు పెద్ద ఊరట లభించనుంది. వాణిజ్య గ్యాస్ ధరలు తగ్గించడం ఇది వరుసగా ఆరో నెల. అక్టోబర్ 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.25.5 తగ్గించిన విషయం తెలిసిందే.
దీపావళి పండుగ సీజన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో అక్టోబర్ ఫస్ట్ హాఫ్‌లో భారతదేశంలో ఇంధన విక్రయాలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపాదికన 22 నుంచి 26 శాతం పెరిగాయని, అక్టోబర్ మొదటి అర్ధభాగంలో నెలవారీ పెరుగుదల కూడా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 15 మధ్య కాలంలో పెట్రోల్ అమ్మకాలు 22.7 శాతం పెరిగి 1.28 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అదే సమయంలో గతేడాది 1.05 మిలియన్ టన్నులు పెట్రోల్ అమ్మకాలు జరిగాయి.
డొమెస్టిక్ సిలిండర్ ధరలను తగ్గించకపోవడంతో సామాన్య ప్రజలు పెదవి విరిస్తున్నారు. పెంచిన ధరలను గత నాలుగు నెలల నుంచి తగ్గించకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ఢిల్లీలో రూ.1053, కోల్‌కతాలో రూ.1079, చెన్నైలో రూ.1068, ముంబైలో రూ.1052, తెలుగు రాష్ట్రాల్లో 1105 రూపాయలకు అందుబాటులో ఉంది.
Also Read: Australia vs Ireland: ఐర్లాండ్ పై ఆసీస్ గెలిచే... సెమీస్ ఆశలు నిలిచే...!
Also Read: Anchor Sreemukhi: నడుము అందాలతో శ్రీముఖి కనువిందు.. లేటెస్ట్ ఫొటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook