Gold Testing: గత ఏడాది జూన్​ నుంచి బంగారు ఆభరణాలకు హాల్​మార్క్ తప్పనిసరిగా మారింది. అంతకు ముందే ప్రభుత్వం హాల్​మార్క్ తప్పనిసరి చేసినా.. దాని అమలను వివిధ కారణాల వల్ల వాయిదా వేస్తూ వస్తోంది. ఎట్టకేలకు గత ఏడాది తప్పనిసరి చేసింది. దీనితే ప్రస్తుతం బంగారు ఆభరణాలు హాల్​మార్క్​ ఉంటేనే విక్రయించే వీలుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాల్​ మార్క్ అంటే ఏమటి?


బంగారం స్వచ్ఛతను తెలిపేదే హాల్​మార్క్​. బంగారం స్వచ్చనతను తెలియజేస్తూ.. అది 14, 18, 22 క్యారెట్లలో ఏ క్యాటగిరికి చెందినది అని వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వాధీనంలోని హాల్​మార్క్ సెంటర్లు మాత్రమే స్వచ్ఛతను నిర్ణయిస్తాయి.


పసిడి విక్రయాల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు 2000 సంవత్సరం నుంచే హాల్​మార్క్ విధానాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. అయితే అప్పట్లో ఇది తప్పనిసరిగా ఉండేది కాదు.


దేశవ్యాప్తంగా హాల్​మార్క్​ సెంటర్లు గతంతో పోలిస్తే భారీగా పెంచి.. హాల్​మార్కింగ్​ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.


పాత నగల పరిస్థితి ఏమిటి?


అయితే హాల్​మార్క్ లేకుండా గతంలో చాలా మంది బంగారు ఆభరణాలు కొన్నారు. దీనితో చాలా మంది తమ వద్ద ఉన్న నగలు స్వచ్ఛతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనితో హాల్​మార్క్ లేని నగల స్వచ్ఛతను తెలుసుకునేందుకు కేంద్ర వినియోదరాలు వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఎవరైనా తమ వద్ద ఉన్న నగలను హాల్​మార్క్ కేంద్రాల్లో స్వచ్ఛతను తెలుసుకునే వీలుందని తెలిపింది ప్రభుత్వం.


నాలుగు ఆభరణాలకైతే రూ.200 చెల్లించాలని పేర్కొంది. ఐదు అంతకన్నాఎక్కువ నగలు ఉంటే ఒక్కో ఆభరణానికి రూ.45 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. హాల్​మార్క్ సెంటర్లలో టెస్టింగ్​కోసం ఏం చేయాలి? దగ్గర్లో ఉన్న టెస్టింగ్ సెంటర్లను ఎలా తెలుసుకోవాలి? సహా ఇతర మార్గదర్శకాలన్నిటిని బిస్​ (BIS)వెబ్​సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది ప్రభుత్వం.


Also read: Aadhaar Update: ఆధార్​లో ఫొటో మార్చుకోవాలా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..


Also read: Smart TV Offers: రూ.7,749 ధరకే 42 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook