GPES IPO: ఐపీవో అంటే ఇలా ఉండాలి, అడుగెట్టగానే 4 రెట్ల లాభాలు
GPES IPO: షేర్ మార్కెట్ ఎప్పుడు ఎవరిని ఎలా ఏం చేస్తుందో అర్ధం కాదు. ఉన్నట్టుంది ధనవంతుల్ని చేస్తుది. లేదా కిందకు తొక్కేస్తుంది. అలాంటిదే ఓ ఐపీవో ఇలా మార్కెట్‌లో అడుగెట్టిందో లేదో ఇన్వెస్టర్లను ధనవంతులు చేసేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
GPES IPO: ప్రతి వారం షేర్ మార్కెట్‌లో చాలా కంపెనీల ఐపీవోలు ప్రారంభమౌతుంటాయి. కొన్ని హిట్ అవుతుంటాయి. కొన్ని విఫలమౌతుంటాయి. ఈ నెలలోనే ఎన్నికల తరువాత లాంచ్ అయిన ఆ కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలు ఆర్జించిపెట్టింది. అదే జీపీ ఎకో సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఐపీవో.
జీపీ ఈకో సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ అనేది సోలార్ కంపెనీ. ఈ కంపెనీ ఐపీవో లిస్టింగ్ జూన్ 14న ప్రారంభమై జూన్ 19న క్లోజ్ అయింది. ఒక లాట్ 1200 షేర్లుగా రిటైల్ ఇన్వెస్టర్లకు కంపెనీ నిర్ణయించింది. ఒక్కొక్క షేర్ 90 నుంచి 94 రూపాయలుగా నిర్ణయించింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఇందులో పెట్టుబడి పెట్టాలంటే 1,12,800 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఇది ఒక లాట్ ధర. ఈ ఐపీవో ద్వారా కంపెనీ 30.79 కోట్లను సేకరించగా 32.76 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేసింది. ఐపీవో ఇలా లిస్టింగ్ అయిందో లేదో ఇన్వెస్టర్ల సొమ్ము 4 రెట్లు పెరిగిపోయింది. ఎన్ఎస్ఈలో ఈ కంెపనీ షేర్ ఇప్పుడు 393.75 రూపాయల ఐపర్ సర్క్యూట్‌కు చేరుకుంది.
సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఈ కంపెనీ ఇప్పుడు మార్కెట్‌లో బంపర్ లిస్టింగ్‌లో ఉంది. జూన్ 14న లిస్టింగ్ అయిన ఈ ఐపీవో అంతకంటే ముందు జూన్ 13న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 8.30 కోట్లు సేకరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరిచిన మూడ్రోజుల్లో 1187.72 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తానికి ఐపీవోలో అడుగుపెట్టగానే ఇన్వెస్టర్లకు 4 రెట్లు లాభాలు ఆర్జించిపెట్టిన ఈ కంపెనీ షేర్లు ఇంకా పెరగవచ్చనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా.
Also read: OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook