GST collection: గత నెలలో (2021 డిసెంబర్​) వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ మొత్తం వసూళ్లు రూ.1.29 కోట్లపైనే నమోదవడం (GST collection in December) గమనార్హం. జీఎస్​టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా ఆరో నెల.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీఎస్​టీ వసూళ్లు నవంబర్​ నెలలో రూ.1.31 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.


క్రితం ఏడాది డిసెంబర్​తో పోలిస్తే.. జీఎస్​టీ వసూళ్లు 13 పెరిగాయి. 2019 డిసెంబర్​తో పోలిస్తే 26 శాతం అధికంగా వసూళ్లు నమోదయ్యాయి.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీఎస్​టీ వసూళ్లు సగటున రూ.1.30 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక మొదటి త్రైమాసికంలో జీఎస్​టీ వసూళ్ల సగటు రూ.1.10 లక్షల కోట్లుగా ఉంది. రెండో త్రైమాసికంలో సగటున రూ.1.15 లక్షల కోట్ల జీఎస్​టీ వసూళ్లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.


డిసెంబర్​లో వసూళ్లు ఇలా..


గత నెలలో మొత్తం రూ.1,29,78 కోట్లు వసూలయ్యాయి. అందులో కేంద్ర సీజీఎస్​టీ (కేంద్ర జీఎస్​టీ) రూ.22,578 కోట్లు(CGST collection in December). రాష్ట్రాల జీఎస్​టీ వాటా (ఎస్​జీఎస్​టీ) రూ.28,658 కోట్లు(SGST collection in December). సమీకృత జీఎస్​టీ (ఐజీఎస్​టీ) రూ.69,155 కోట్లుగా నమోదైనట్లు (IGST collection in December) ఆర్థిక శాఖ పేర్కొంది. సెస్​ల రూపంలో రూ.9,389 కోట్లు గడించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.


Also read: LPG Price: న్యూ ఇయర్ రోజు గుడ్​ న్యూస్​- తగ్గిన ఎల్​పీజీ సిలిండర్ ధరలు!


Also read: ATM Charges : ఏటీఎం విత్ డ్రా కొత్త ఛార్జీలు.. నేటి నుంచి పెరగనున్న ఛార్జీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook