HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు సేవలు బంద్
HDFC Bank Services: జూన్ నెలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలకు సంబంధించి రెండు రోజులు అంతరాయం కలగనుంది. సిస్టమ్ నిర్వహణ, అప్‌గ్రేడేషన్ కోసం డౌన్‌టైమ్ నిర్వహించడంతో జూన్ 10, 18 తేదీలలో పలు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ వెల్లడించింది. వివరాలు ఇలా..
HDFC Bank Services: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ముఖ్య గమనిక. ఈ నెలలో బ్యాంక్ సేవలు రెండు రోజులపాటు బంద్ కానున్నాయి. అయితే అన్ని సేవల నిలిచిపోవట్లేదు. కేవలం కొన్ని సేవలకు అంతరాయం కలగనుంది. ఆ రెండు రోజులు ఇబ్బందులు ఎదురవుతాయని.. కస్టమర్లు సహకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందరికీ ఈమెయిల్ ద్వారా తెలియజేసింది. సిస్టమ్ నిర్వహణ, అప్‌గ్రేడ్ కారణంగా కస్టమర్లకు అందుబాటులో ఉన్న కొన్ని సేవలను 2 రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించినట్లు బ్యాంక్ వెల్లడించింది.
జూన్ 10, 18 తేదీలలో రెండు రోజులపాటు పలు సేవలకు అంతరాయం కలగనుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఖాతాదారులు కౌంట్ బ్యాలెన్స్, డిపాజిట్, ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన సేవల ప్రయోజనాన్ని పొందలేరని పేర్కొంది. ఈ మూడు సర్వీసులు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంక్ అప్‌గ్రేడ్ చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామంది.
దీంతోపాటు జూన్ 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఖాతాదారులకు బ్యాంకింగ్ సౌకర్యాల ప్రయోజనం ఉండదని చెప్పింది. సిస్టమ్ నిర్వహణ, అప్‌గ్రేడేషన్ కోసం డౌన్‌టైమ్ నిర్ణయించినట్ల కస్టమర్లకు సమాచారం అందించింది.
Also Read: Best Low Price Laptops: అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో లభించే 4 ల్యాప్‌టాప్‌లు ఇవే..!
అయితే కస్టమర్లు వాట్సాప్ ద్వారా తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది. ఇందుకోసం 7070022222 నంబరుకు మెసేజ్ చేయవచ్చని తెలిపింది. వాట్సాప్‌లో ఇచ్చిన సూచనలను అనుసరించి.. మీరు ఖాతాకు సంబంధించిన సౌకర్యాల ప్రయోజనాన్ని పొందవచ్చని సూచించింది. బ్యాలెన్స్ ఎంక్వైరీపై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చని.. ఇతర సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటాయని తెలిపింది. బ్యాంక్ వినియోగదారులు సహకరించాలని కోరింది. అదేవిధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఎంపిక చేసిన డెబిట్ కార్డుల సేవలు జూన్‌లో కొన్ని గంటల పాటు మూసివేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది.
Also Read: T20 World Cup 2024: ఐసీసీ షాకింగ్ నిర్ణయం..! టీ20 వరల్డ్ కప్ వేదిక మార్పు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook