Best Low Price Laptops: ప్రస్తుతం నోట్‌బుక్ ల్యాప్‌టాప్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సులభంగా క్యారీ చేయడంతోపాటు ప్రయాణాల్లో కూడా ఈజీ ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుండంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లు చాలా తక్కువ బరువు ఉంటాయి. డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. సాధారణ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే నోట్‌బుక్ ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకే లభిస్తాయి. అనేక రకాల నోట్‌బుక్ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మీ కోసం సరైనది ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా..? ఏది ఎక్కువగా అమ్ముడవుతుందో.. మార్కెట్ డిమాండ్ ఎక్కువ దేనికి ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళదాం..
ACER ASPIRE 3 ల్యాప్‌టాప్ 8 జీబీ ర్యామ్‌తో మార్కెట్లోకి రానుంది. ఇది 14 నుంచి 15.6 అంగుళాల ఫుల్ హెచ్ డిస్‌ప్లేతో వినియోగదారులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లో ఏసర్ ప్యూరిఫైడ్ వాయిస్, ఆల్ నాయిస్ రిడక్షన్ వంటి ఫీచర్లు యాడ్ చేశారు. ఇవి ఆడియోను మరింత క్లారిటీగా వినేందుకు ఉపయోగపడతాయి. దీని ధర రూ.37,700.
HP 14s ల్యాప్‌టాప్ కూడా మంచి ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. అడ్జస్టబుల్ స్టాండ్, ఫింగర్‌ప్రింట్ రీడర్, ఇంటిగ్రేటెడ్ అలెక్సా వాయిస్ అసిస్టెన్స్ వెబ్‌క్యామ్, క్విక్ ఛార్జ్, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, బ్యాక్‌లిట్ కీబోర్డ్ వంటి అన్ని ఫీచర్లు యాడ్ చేశారు. బ్యాటరీ కూడా పవర్ ఫుల్‌గా ఉంటుంది. 45 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని బరువు 1.41 కిలోలు ఉంటుంది. ఇది అలెక్సా కనెక్టివిటీ, విండోస్ 11, డ్యూయల్ స్పీకర్లతో వచ్చే i3 ల్యాప్‌టాప్. దీని ధర రూ.59,990 ఉంటుంది.
ఆసుస్ ఈఈబుక్ 14 ల్యాప్‌టాప్ 1920x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 14.1-అంగుళాల డిస్‌ప్లేతో ఉంటుంది. ఇది ఔట్ డోర్‌లో కూడా ఉపయోగపడే యాంటీ గ్లేర్ డిస్‌ప్లేతో సెట్ చేసి ఉంటుంది. ఇందులో ఇంటెల్ పెంటీఎమ్ ఎన్6000 ప్రాసెసర్ ఉంటుంది. దీంతో పాటు ఇది GB DDR4 RAM, 256 GB SSDతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.25,990 ఉంటుంది.
Also Read: Namibia Squad: నమీబియా తరఫున ఆడనున్న డుప్లెసిస్, డివిలియర్స్.. జట్టులో పేర్లు ప్రకటన..!
Infinix INBook X1 Neo ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 45W AC అడాప్టర్‌తో 11 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, Intel Celeron Quad Core N5100 ప్రాసెసర్ ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దీని బరువు 1.24 కిలోలు కాగా.. ధర రూ.25,899 ఉంటుంది.
Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ 2023.. రిషభ్ పంత్‌కు తుది జట్టులో చోటు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook