HDFC merge: హెచ్డీఎఫ్సీ బ్యాంక్-హెచ్డీఎఫ్సీ విలీనంతో వచ్చే భారీ మార్పులు ఇవే..
HDFC merge: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థలు విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు సంస్థల విలీన ప్రభావం ఖాతాదారులు, షేర్ హోల్డర్స్, సంస్థ ఉద్యోగులపై ఎలా ఉండనుంది?
HDFC merge: దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. అతిపెద్ద హౌసింగ్ ఫినాన్స్ కంపెనీ (హెచ్డీఎఫ్సీ లిమిటెడ్) విలీనం కానున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో.. దేశంలో అతిపెద్ద ఫినాన్స్ కార్పొరేట్ సంస్థగా అవతరించనుంది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌లో వాటాలున్న వారికి ప్రతి 25 షేర్లకు గానూ.. విలీన కంపెనీలో 25 షేర్లు లభించనున్నాయి.
వినియోగదారులు తెలుసుకోవాల్సిందేమిటి?
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ప్రస్తుతం 68 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. 6,342 బ్యాంక్ బ్రాంచ్‌లు ఉన్నాయి. రెండు సంస్థల విలీన ఒప్పందం ఖరారైనప్పటికీ.. ఆ ప్రక్రియ ముగిసేందుకుకు మరో ఏడాదికిపైగా సమయం పట్టొచ్చు. అప్పటి వరకు రెండు సంస్థలు వేరువేరుగానే కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
ఇక విలీన సంస్థ అమలులోకి వస్తే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులకు సులభంగా హోం లోన్స్ లభించే వీలుంటుంది. అదే విధంగా విధంగా హెచ్‌డీఎఫ్‌సీలో లోన్ తీసుకునే వారికి.. మంజూరైన మొత్తం జమ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టేది. నిధుల కొరత ఇందుకు కారణం. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం తర్వాత వేగంగా రుణాల మంజూరువడమే కాకుండా.. అంతే వేగంగా రుణ గ్రహీతలకు నగదు చెల్లింపు కూడా పూర్తవుతుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులకు లాభమా? నష్టమా?
హెచ్డీఎఫ్సీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం అయితే ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందే అనుమానాలకు ప్రముఖ కార్పొరేట్ వ్యవహారాల విశ్లేషకులు, ఎస్ సెక్యూరిటీస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ లీడ్ అనలిస్ట్ శివాజీ తప్లియాల్ సమాధానమిచ్చారు. రెండు సంస్థలు విలీనమైనప్పటికీ సంస్థ ఉద్యోగులపై ప్రభావం పడదన్నారు. అందరి ఉద్యోగాలు సురక్షితమేనని స్పష్టం చేశారు.
అదే విధంగా హెచ్డీఎఫ్సీ బ్రాంచ్‌లు పూర్తి స్థాయి బ్యాంక్‌లుగా మారొచ్చని తెలిపారు శివాజీ తప్లియాల్. అయితే విలీనం తర్వాత వినియోగదారుల ఖాతా నెంబర్లు మారొచ్చని కూడా తప్లియాల్ వివరించారు. అయితే అందుకు చాలా సమయం పట్టొచ్చన్నారు. ఇటీవల ప్రభుత్వం రంగ బ్యాంకుల విలీనం మాదిరిగానే.. దశల వారీగా ఖాతాల నెంబర్లు మార్చడం వంటి ప్రక్రియలు జరగొచ్చని పేర్కొన్నారు.
Also read: CNG Price: ఆటోవాలాకు షాక్.. పెట్రోల్, డీజిల్‌తో పోటీగా పెరుగుతున్న సీఎన్జీ ధరలు
Also read: iPhone Thefts: ఐఫోన్ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు యాపిల్ సంస్థ కీలక నిర్ణయం...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook