HDFC Bank Hikes MCLR: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్) రేట్లను పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. 0.05 శాతం నుంచి 0.15 శాతానికి పెంచినట్లు వెల్లడించింది. కొత్త రేట్లు మే 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయని తెలిపింది. తాజా రేట్ల పెంపుతో హోమ్ లోన్, వెహికల్ లోన్‌ ఈఎంఐలపై మరింత భారం పడనుంది. ఈ మేరకు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందుబాటులో ఉంచింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.95 శాతం, ఒక నెలకు 8.10 శాతం, 3 నెలలకు 8.40 శాతం, 6 నెలలకు 8.80 శాతం, ఒక ఏడాదికి 9.05 శాతం, రెండేళ్లకు 9.10 శాతం, మూడేళ్లకు  9.20 శాతానికి పెంచినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. దీంతో హోమ్ లోన్, వాహనాల లోన్ల ఈఎంఐలు మరింత ప్రియం కానున్నాయి. భవిష్యత్‌లో లోను తీసుకోవాలని అనుకుంటున్నా.. అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపు ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై వర్తిస్తుంది. ఇది స్థిర వడ్డీ రేటుపై ఎలాంటి ప్రభావం చూపదు.  


ఎంసీఎల్ఆర్ అంటే..?


లోన్ కోసం బ్యాంకులు విధించే కనీస వడ్డీ రేటును మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు ఆధారంగా నిర్ణయిస్తారు. ఎంసీఎల్ఆర్ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపిస్తుంది. ఎంసీఎల్‌ఆర్‌ను నిర్ణయించేటప్పుడు డిపాజిట్ రేట్లు, రెపో రేట్లు, ఆపరేషనల్ ఖర్చులు,  నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించడానికి అయ్యే ఖర్చుతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తరువాతే ఎంసీఎల్ఆర్‌ రేటును పెంచుతారు. 


ఎంసీఎల్ఆర్ అమలుకు ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్లకు కనీస వడ్డీ రేటుగా బేస్ రేటుగా పరిగణించేది. ఇది ఫంక్షనాలిటీ పరంగా ఎంసీఎల్ఆర్ రేటు మాదిరే అదే ప్రయోజనాన్ని అందిస్తుంది. లోన్లు ఇచ్చే బ్యాంకులు రుణగ్రహీత నుంచి వసూలు చేసే అతి తక్కువ వడ్డీ రేటుగా ఉపయోగపడుతుంది.


Also Read: KKR Vs PBKS Deam11 Prediction 2023: కేకేఆర్ ఓడితే ఇంటికే.. నేడు పంజాబ్‌తో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..  


Also Read: Mutual Fund Calculator: రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేయండి.. కోటీశ్వరులు అవ్వండి ఇలా.. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి