KKR Vs PBKS Deam11 Prediction 2023: కేకేఆర్ ఓడితే ఇంటికే.. నేడు పంజాబ్‌తో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..

Kolkata Knight Riders Vs Punjab Kings Dream 11 Tips: సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. కేకేఆర్‌కు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. అటు పంజాబ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలుపొంది పాయింట్ల పట్టికలో దూసుకెళ్లాలని చూస్తోంది. డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : May 8, 2023, 11:25 AM IST
KKR Vs PBKS Deam11 Prediction 2023: కేకేఆర్ ఓడితే ఇంటికే.. నేడు పంజాబ్‌తో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..

Kolkata Knight Riders Vs Punjab Kings Dream 11 Tips: ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ప్లే ఆఫ్ రేసులో ముందడగు వేయాలంటే ఈ మ్యాచ్‌ రెండు జట్లు కీలకంగా మారింది. ముఖ్యంగా కేకేఆర్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు తప్పుకుంటుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. అటు పంజాబ్ 10 మ్యాచ్‌లు ఆడి.. ఐదింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఏకంగా మూడోస్థానానికి చేరుకుంటుంది. కేకేఆర్ తన చివరి మ్యాచ్‌లో గెలవగా.. పంజాబ్ ఓటమిపాలైంది. సోమవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? ప్లేయింగ్ ఎలెవెన్ ఉండబోతుంది..? డ్రీమ్ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..?

పిచ్ రిపోర్టు ఇలా..

ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. తొలి ఇన్నింగ్స్ సగటు 176 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరదపారే అవకాశం ఉంది. పేసర్లకు కూడా పిచ్ నుంచి సహకారం లభిస్తుంది. పేసర్లు 67 శాతం వికెట్లు తీసుకోగా.. స్పిన్నర్లు గత మూడేళ్లలో ఈ పిచ్‌పై కేవలం 33 శాతం వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఈ పిచ్‌పై ఛేజింగ్ చేసిన జట్టే ఎక్కువసార్లు విజయం సాధించింది. దీంతో మరోసారి టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. 

హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా.. 

కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 20 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గణాంకాలను చూస్తే.. పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌దే పై చేయిగా కనిపిస్తున్నా.. నేటి మ్యాచ్‌లో టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. రెండు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా జరగనుంది. 

తుది జట్లు ఇలా.. (అంచనా)

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జేసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి

పంజాబ్ కింగ్స్: అథర్వ టైడ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్.

డ్రీమ్ 11 టీమ్ టిప్స్..

వికెట్ కీపర్లు: రహ్మానుల్లా గుర్బాజ్, జితేష్ శర్మ
బ్యాట్స్‌మెన్లు: శిఖర్ ధావన్, అథర్వ టైడ్, జేసన్ రాయ్ (కెప్టెన్), నితీష్ రానా
ఆల్‌రౌండర్లు: ఆండ్రీ రస్సెల్, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్ (వైస్ కెప్టెన్)
బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

Also Read: Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా..

Also Read: RR vs SRH IPL 2023 Highlights: హైఓల్టెజ్ థ్రిల్లింగ్ మ్యాచ్.. రాజస్థాన్ కొంపముంచిన నోబాల్.. ఆఖరి బంతికి సిక్సర్‌తో హైదరాబాద్ విక్టరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News